ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సమస్త భారతావనిలో 12 మార్చి 2021 నుండి 15 ఆగష్టు 2022 వరకు మొత్తం 75 వారాల పాటు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వాలు నిర్వహించడం మనకందరికీ ఆనందదాయకం.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 15 ఆగష్టు 2022తో డేభై ఐదు వసంతాలు పూర్తి అయ్యింది. భారత దేశానికి దాదాపు 200 సంవత్సరాలు పాలించిన తెల్లదొరల పై సమరానికి సిద్ధమై ఉద్యమాల బాట పట్టి సత్యం అహింస అనే ఆయుధాలతో భారత దేశాన్ని స్వాతంత్ర్య దిశగా నడిపించిన ఉద్యమ నాయకుడు మాహత్మ గాంధీ.
1857 సిపాయిల
తిరుగుబాటులో నాయకత్వం వహించి ఆంగ్లేయులతో వీరొచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, బాహదూర్ షా , నానాసాహెబ్,తాంతియాతోపే.1857 మార్చి 29న బెంగాల్ లోని భారఖ్ పూర్ నందు దేశీయ కాల్బలం విభాగానికి చెందిన 34 వ బెటాలియన్ 1446 నెంబర్ సిపాయి
మంగళ్ పాండే ఆవు తూటాలను ఉపయోగించుటకు నిరాకరించడంతో ఆంగ్లేయుల అధికారి కల్నల్ భాఘ్ ను కాల్చి చంపడంతో మంగళ పాండే ను ఉరితీయడం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ ఘట్టంగా అభివర్ణించవచ్చు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మితవాదులైన లాలా లజపతి రాయ్,
బాల గంగాధర తిలక్ , బిపిన్ చంద్రపాల్, అతివాద నాయకులు
భగత్ సింగ్,సుఖదేవ్,రాజగురు ఇంక్విలాబ్ జిందాబాద్... విప్లవం వర్ధిల్లాలి....అనే నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం వలన మరికొంత మంది వీరులకు, పోరాట యోధులకు ఉత్సాహాన్నింపింది.
గాంధీజీ నాయకత్వంలో 1917లో జరిగిన తొలి చంపారన్ ఉద్యమంతో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం 1918లో జరగిన ఖేడా ఉద్యమం,1919 లో ఖిలాఫత్ ఉద్యమం,1920లో సహాయ నిరాకరణ ఉద్యమం 1930లో ఉప్పు సత్యాగ్రహం,1942 లో క్విట్ ఇండియా ఉద్యమాలు జరిగాయి. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా ఉద్యమాలు జరిగాయి. 1919 లో అమృత్ సర్ లోని జలయాన్ వాలాబాగ్ లో జరిగిన సంఘటనలో జనరల్ డయ్యర్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాల్పులకు తెగబడ్డడం వలన కొన్ని వందల మంది భారతీయులను చంపడం కలవర పరిచింది. మార్షల్ చట్టాన్ని అమలు చేసిన డయ్యర్ ను 1940 లో ఉద్దంసింగ్ హత్య చేసి పగ తీర్చడం భారత చరిత్రలో మరుపురాని ఘట్టంగా అభివర్ణించవచ్చు.
వీరుల, పోరాట యోధుల పోరాట ఘట్టాలలో మహనీయుల త్వాగాల ఫలితంగా సాధించిన విజయాలను స్మరిస్తూ వారి కీర్తి ప్రతిష్టలు, విశేషాలను ప్రతి సామాన్య పౌరులకు తెలియజేసేందుకు దేశమంతటా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది.స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరుతో విద్యాలయాల్లో ఉత్సవాలు, సంబరాలు అంగరంగ వైభవంగా సాగించేలా ప్రణాళికలు రూపొందించడం. సాహితీ రంగంలో కవులను, రచయితలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసా పత్రాలు బహుకరించడం
సంతోష దాయకం.ఉషావే కవులచే లిఖించి బడిన అజాదికా అమృత మహోత్సవం సంకలనంలోని కొన్ని కవితలను పరిశీలిద్ధాం.
"హేమాంబుజ మకుటం భళా..!
అతీసుందరం కాశ్మీరం కళా..!
మంగళ మృధంగళ..! మణిమంజరిదళా..!
గంగాజల యమునాంచల స్వర్ణ పూర్ణాంతళా" !!
తూర్పున ఉన్న హిమాలయ పర్వతం భారత మాతకు మకుటంలా శోభిల్లుతు భూతల స్వర్గంగా పరిగణించబడే నభుతో నా భవిష్యత్త్ అనే విధంగా కాశ్మీర్ అద్భుతమైన అందాలతో అలరారుతు మంగళ మృధంగళ మణిమంజరమై గంగా యమునా పవిత్ర నాదాల కళకళా ధ్వనులతో పారుతూ బంగారాన్ని పండిస్తుందని కవి భట్టు మురళి తన వందేవ సత్వం కవితలో వర్ణించడం గొప్ప విషయం.
"ఉరితాళ్ళకు ఊయలలూగిన తలలు..!
తుపాకీ గుండెకు బెదరని గుండెలు..!
జలియన్ వాలాబాగ్ రక్తసిక్తపు ధారలు..!
ఉద్యమ సేద్యంతో సాధ్యం చేసిన కలలు..!
దేశానికి శ్వాసనిచ్చుటకు
తమ శ్వాసను వదులుకున్న వీరులు..!! ... అని కవి ముంజం జ్ఞానేశ్వర్ తన కవిత "ప్రాణమిచ్చిన భారతి" లో జలియన్ వాలాబాగ్ లో ఆంగ్లేయుల సృష్టించిన దుశ్చర్యలను ఎండగట్టారు.
"స్వంత మయ్యె మనకు సంపన్న ఆజాది..!
త్యాగ ఫలము తోడ ధరణి యందు.. !
అంది చేయు జనులు అమృత మహోత్సవం..!
భరత మాత పుత్ర పాడు భక్తి..!!
భారతావనికి మహనీయుల త్యాగ ఫలితంగా
పరిపూర్ణమైన స్వాతంత్ర్యం సిద్ధించిందని అందుచేత భారత మాత బిడ్డలు అజాదికా అమృత మహోత్సవంలో తమ యొక్క దేశభక్తి చాటాలని గురు భక్త కవి నాగోరావు తన ఆటవెలది పద్యమంలో దేశభక్తి ద్వారా సందేశం ఇచ్చారు.
"ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు,
స్వాతంత్ర్య పోరాట కవీంధ్రులారా,
అలిసిపోని కలాలతో కదం తొక్కినారు".....అని కవి కట్ట లక్ష్మణా చారి "స్వర్ణ భారతి" కవితలో వర్ణించారు.
"జయహో జైజై వీరుల దేశభక్తిని,
పరాయి పాలన నుండి విముక్తిని,
చేశారు నా అఖండ భారతావనిని,
డేబై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని,
స్వాతంత్ర్య వీరులను స్మరించుకుని" .... అని కవన కోకిల బంకట్ లాల్ జయహో భారతావని కవితలో వర్ణించారు."భారత దేశ విముక్తి కోసం, మనుగడ కోసం,భావితరాల బతుకులకో, తుపాకీతోను బాంబులతోను, తెల్లదొరలను ఎదిరించి దేశభక్తిని చాటిన ఈ భారత ఖండంలో వీరులెందరో అమరులైనారని"... కవి మోతీరామ్ తన కవితలో దేశ వీరుల్లారా మీకు మా జోహార్లు అని చక్కగా చెప్పారు.
"ఏది నీ దేశభక్తి అటుపైన దాచావా,
అలంకరణకు తీస్తావా ఆగస్టు పదిహేనున,
గుండెల పై పెట్టుకున్న మువ్వన్నెల జెండాలు,
కాళ్ళ కింద పడి నలిగితె కళ్ళు నెత్తికెక్కాయా,
బూజుపట్టిన మసిబారిన బుర్రను సరిజేసుకో
త్రివర్ణ జెండాను ఆత్మ గౌరవంగ చూసుకో"..... అని తన "వందే భారతం" కవితలో
ముంజం మల్లికార్జున్ నేటి యువతరానికి చురకలు అంటించారు.
"నేను నా దేశము కోసము నా ప్రాణాలైన అర్పిస్తా..!సరిహద్దులో నివసిస్తా..! సమాజాభివృద్ధికి రక్షిస్తా..! సమాజం గౌరవించేలా సేవ చేస్తా..! ఉగ్రవాదుల దాడిలో,
అమరుడై వస్తా..! కాని ఆత్మ గౌరవంగ పతాకాన్ని
ఎగరవేస్తా..! అని బాలకవి దవళే వివేక్ "భారత దేశము నీకోసం నా ప్రాణాలు సైతము" అనే కవితలో దేశ సరిహద్దులలో పహారా కాస్తూ ఉగ్రవాదుల దాడి నుండి దేశానికి రక్షణ కవచంగా ఉన్న భారత వీర జవాన్ల గురించి వివరించారు.
యువ కవి గాలి రోహిత్ తన కవిత "అక్షరాభిషేకం" లో "నీ సిగలో విరిసిన బ్రహ్మ కమలాలు, చల్లని తెల్లని కాంతుల శాంతులు పంచగా... అందుకోవమ్మా భారతమా... లక్షల గళాలు అక్షర జలాలతో భారత మాతకు అభిషేకం చేశారు.
కవులు వినోద్ కుమార్ "మువ్వన్నెల పతాకం" మంగం విషం రావు "టెక్నాలజీ భారత" మధుకర్ "ఘనత" ధరంసింగ్ "అందుకో మా వందనం" లాల్ షావ్ "భారత వానిలో పుట్టిన వీరులు" రామకృష్ణ "ఇండియన్ ఆర్మీ" సాయి కుమార్ ఆజాదికా అమృత మహోత్సవ్ మొదలగు శీర్షికలతో కవులు స్వాతంత్ర్య సమర యోధులకు అక్షరాంజలి ఘటించారు.ఉసావే కవులు రచయితలు తమ తమ రచనల ద్వారా అఖండ భారతావనికి వజ్రోత్సవం వేళ
నీరాజనం సమర్పించడం అభినందనీయం.
రచన:-ఉసావే కవులు
పేజీలు:51; వెల: రూ, 21/
ప్రతులకు: ఫోన్-8500660407.
సమీక్షకులు
రాథోడ్ శ్రావణ్. ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా. 9491467715

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి