మూఢతత్త్వం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
  వేమన పద్యాలు రాయడానికి పూనుకున్నది  మూఢనమ్మకాలను నిర్మూలించాలన్న అభిప్రాయంతో. మూఢ నమ్మకం ఎందుకు ఏర్పడుతుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. మనం ఏదైనా  కార్యక్రమం కోసం బయలుదేరే ముందు ఒక వితంతువు ఎదురు పడితే ఆ పని జరగనట్లే దానితో  వెళ్లడం మానేస్తాడు ఆ పని అలాగే మిగిలిపోతుంది.  ఒంటి బ్రాహ్మణుడు వస్తే శవం ఎదురుపడితే కూడా ఇలాంటి అభిప్రాయాలు సమాజంలో పాతుకుపోయి ఉన్నాయి.  హేతుబద్ధంగా ఆలోచించే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. భర్తను కోల్పోయి ఎంతో బాధతో ఉన్న ఒక వితంతువు  ఈ విషయం తెలిస్తే ఎంత మధన పడుతుంది. ఈ జీవితం ఎందుకు అని ఆత్మహత్య చేసుకునే స్థితికి కూడా వస్తుంది  ఇంట్లో వాళ్ళు  బయటికి వెళ్ళవద్దు నీ వల్ల మనం మాట పడవలసి వస్తుంది అని అన్నప్పుడు  ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అతడు బయలుదేరిన కార్యక్రమానికీ, ఈ వితంతువు ఎదురు రావడానికి ఏమైనా సంబంధం ఉందా?  గూబ (శకున పక్షి) ఇంటి మీద వాలితే ఆ ఇంటిని వదిలి వెళ్లే వారిని ఏమనాలి? ఆ పక్షి వాలడానికి, ఇతర పనులు జరగక పోవడానికి   ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటి వారిని వెర్రి వారుగా   జమ కడుతున్నాడు వేమన.  వెర్రి వారు అంటే పిచ్చి వారు, మనసు సరిగా పని చేయని వాడు అని మనం అనుకుంటాం. కానీ వెర్రి అనే దానికి  అంకితభావం, అతను  గాఢంగా నమ్మి ఆ పనిని చేయడం ఎవరికో ఏదో జరిగి ఉంటుంది  దానిని ఆధారం చేసుకునే గొర్రెదాటుగా అందరూ అదే మూసలో వీటిపై నమ్మకాన్ని పెంచుకుంటారు. పక్షి వాలితే ఇళ్లు పాడుపడవలసిందేనా?  అలాంటి వాళ్ళని నమ్మ వద్దు అని చెప్పడం కోసమే వేమన ఈ పద్యాన్ని  మనకందించాడు.
"గూబ చేర గురము గునిసి  బాడుగ బెట్టి
వెళ్ళిపోదు రెంత వెర్రి వారొ
గూబ గురము లేమి కూర్చురా కర్మంబు..."


కామెంట్‌లు