ఈ ప్రపంచంలో మనిషిని పాతాళానికి తొక్కి వేసేది మోహం. ఒక అందమైన వస్తువును చూసినప్పుడు దానిని సొంతం చేసుకోవాలని అనుకోవడం మానవ ప్రకృతి. అలాగే ఒక అందమైన పడతి కనిపించినప్పుడు శరీరం సడలిపోయి పళ్ళు ఊడి నడవలేని స్థితిలో ఉన్న వారు కూడా ఆ స్త్రీతో అనుభవించాలన్న మోహం పోదు. ఆ మొహాన్ని పోగొట్టుకుంటే జీవితం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వేమన జీవితంలో తన అనుభవాలని అన్నిటినీ పేర్చి ఈ పద్యాన్ని మనకు అందించారు అని అనిపిస్తోంది. విశ్వద అన్న వేశ్యతో సంపర్కం పెట్టుకొని వదిన ద్వారా డబ్బు తీసుకొని ఇంటిని పట్టించుకోకుండా ఆమె లోకం అనుకుంటూ ప్రవర్తించిన వేమన వదినగారి పెంపకంలో ఆమె సలహా మేర అతి ముఖ్యమైన జీవితానికి స్వస్తి చెప్పి, ఆ మోహాన్ని వదిలి వేసి బయటకు రావడం వల్ల ఇవాళ ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే ఆటవెలదులను మనకందించాడు యోగివేమన కన్న తల్లిని మించిన ప్రేమతో బిడ్డ పతనమై పోతున్నాడు అన్న తపనతో మంచి మార్గంలో పెట్టడం కోసం ఆమె పన్నిన పన్నాగం నుంచి ఆ క్షణం వరకు పాప కూపంలో, రొంపిలో కొట్టుమిట్టాడుతున్న వేమన ఈ లోకం లోకి వచ్చి పడ్డాడు. ఈ మోహాన్ని చాలా అందంగా పోలుస్తూ ఈ ఆటవెలది మనకందించారు. ఏదైనా ఒక మంట చూసినప్పుడు ఆ మంటల్లోకి ముందు మిడత వెళ్లి దగ్ధమై పోతుంది.
వెలదుల ఆకర్షణ;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి