శ్రీనివాస రెడ్డి గారికి బాగా పాడే గాయనీ గాయకులను తీసుకు వచ్చి చక్కటి సంగీత కచేరీలు చేయడం ఇష్టం. మంచి నాటకాలు దొరికితే వాటిని వేదికపై ప్రదర్శింప చేయడం ఆయన పని. ఈ నేపథ్యంలో నేపథ్యగాయకులతో 108 రోజులు 108 సంగీత కచ్చేరీలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలన్న సంకల్పం కలిగింది. దాని కోసం సుశీల, జానకి, ఎల్లారీశ్వరి లాంటి వాళ్ళని ఎన్నుకోవడం మధుర స్వరం కలిగిన రామకృష్ణను కూడా కలవాలని కోరిక నిర్వాహకులకు రావడం. ఎవరి ద్వారా ఈ పని అవుతుందని చర్చించి చివరికి గుంటూరు ఆర్టీసీ లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాదులో డబ్బింగ్ ఇన్చార్జిగా ఉన్న విగ్రహాల రామారావుకు రామకృష్ణ సన్నిహితుడని తెలిసి అతని ద్వారా ప్రయత్నించారు. విగ్రహాల రామారావు రామకృష్ణను పరిచయం చేయడం కూడా చాలా గొప్పగా జరిగింది. రెడ్డి గారి గురించి, వారు చెప్పిన విషయాన్ని గురించి వారి కచేరీకి రమ్మంటే రామకృష్ణ ఆత్రంగా పదివేల రూపాయలు తన బ్యాంక్ అకౌంట్లో జమ చేయమన్నాడట ముందు వెళ్లి సంగీత సభలలో పాల్గొంటే అక్కడ మర్యాదలు ఎలా జరుగుతాయో నీకే తెలుస్తుంది అక్కడ జరిగింది నీకు తృప్తిగా లేకపోతే నీవెంత అడిగితే అంత నేనిస్తాను అని చెప్పాడు రామారావు. ప్రణాళిక ప్రకారం వచ్చాడు అప్పటి నుంచి అతి సన్నిహితుడయ్యాడు రెడ్డి గారికి. వారిద్దరి మధ్య రాకపోకలు పెరిగాయి, మంచి మిత్రులయ్యారు ఎప్పుడు వచ్చినా ప్రతిసారీ రెడ్డి గారితో పాడేవాడు. తనకు కావలసిన భక్తి పాటలు కావాలని వేదిక మీద పాడిన రామకృష్ణను రెడ్డి గారికి నచ్చిన పాటలు రామకృష్ణతో వేదికపై పాడించుకొని మురిసిపోయే వారు రెడ్డి గారు మధ్య మధ్యలో రెడ్డి గారి భార్య లక్ష్మితో కలగలిపి పాడమని కోరి మరీ వినిపించుకునే వాడు రామకృష్ణ. రెడ్డి గారిని రామకృష్ణ కలిసినప్పటి నుంచి విరామం లేకుండా సొంత అన్నదమ్ముల్లా కలిసి పోయారు. ఉప్పలపాడు వెళితే తమ్ముడు శ్రీనివాసరెడ్డి తన విశ్రాంతి గృహం నాకు కేటాయిస్తాడు నేను అక్కడే ఉంటాను అంటూ శాశ్వతంగా నాకు విశ్రాంతి గృహం ఇచ్చేస్తానన్నారు తమ్ముడు. అలాంటి తమ్ముడు దొరకడం నా సంచిత సుకృత ఫలం అంటూ తన భార్య జ్యోతితో అనేక సార్లు చెప్పుకున్నాడు. రామకృష్ణ భార్య జ్యోతి కూడా మా మరిది మా మరిది అంటూ ఎంతో ఆప్యాయంగా చూస్తుంది. రెడ్డి గారి కుటుంబాన్ని తన కుటుంబంగా నిర్వహిస్తారు కానీ వేరేగా చూడరు. రామకృష్ణ కుమారుడు సాయి కిరణ్ కూడా అనుకూలంగా వుంటూ తన తండ్రిని ఎలా గౌరవిస్తాడో రెడ్డి గారిని కూడా అలాగే చూస్తారు. అనేక సొంత విషయంలో కూడా రెడ్డి గారి సలహా సంప్రదింపులు పొందుతాడు సాయి కిరణ్ అంత గొప్ప గౌరవం రెడ్డి గారు అంటే. తరువాత రామకృష్ణ ఆరోగ్య రీత్యా కాలం చేయడం ప్రతి నెల రెడ్డి గారు వెళ్లి వారికి కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం రామకృష్ణ మరణించిన రోజున రెడ్డి గారు దగ్గర ఉండి కర్మకాండ చేయించడంతో పాటు గోదావరి పుష్కరాలలో తన కార్యక్రమాలను పూర్తి చేసుకొని రామకృష్ణ పెద్దకర్మ దగ్గరుండి జరిపించిన స్నేహశీలి. పరామర్శించడానికి వచ్చిన సుశీల, జమున లాంటి వారికి దగ్గరుండి మర్యాదలు జరిపించారు రెడ్డి గారు ఆ తర్వాత బోసిగా ఉన్న రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయం ప్రస్తావించి సంబంధం చూడండి వదిన గారు మీరు ఏమి ఖర్చు చేయవలసిన అవసరం లేదు నా బిడ్డగా ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అనుకున్న మాట ప్రకారం అంగరంగవైభవంగా ఆ పాప పెళ్లి జరిగింది. అలాంటి కరుణాంతరంగ హృదయుడు శ్రీనివాసరెడ్డి. తాను నన్ను నాన్న గారని పిలిచినప్పుడు ఆత్మీయత ఎలా ఉంటుందో రుచి చూసిన వాడిని. అది శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమ.
కరుణామయుడు మా శ్రీనివాసుడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
May God bless him in his future endeavor & life to carry his services to Kalaamathalli successfully ...🙏🙏🙏
Raji Reddy Kalva
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి