విజ్ఞతకల రచయిత్రి-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322

 ఎవరి బిడ్డ వారికి చాలా అందంగా ఉంటుంది పిల్లల చేసిన ఏ చిన్న పనైనా ఎంతో అనందాన్ని ఇస్తుంది. పిల్లలా మానస ప్రవృక్తి ప్రత్యేకించి చిన్నపిల్లల్లో వారి ప్రవర్తన వల్ల వారికి ఏ అంశంపై అభిరుచి ఉన్నదో తెలుసుకొని తల్లిదండ్రులు ప్రవర్తించాలి.
మా అమ్మాయి అని చెప్పడం కాదు గాని మా స్వాతి పేరుకు తగిన స్వాతి ముత్యం.  చదువుల సరస్వతి, సంస్కృతినీ, సంప్రదాయాన్ని  అనుసరించే పాప కాగితం పెన్సిలు దొరికితే చాలు దాని మీద ఎలాంటి బొమ్మలు వేస్తుందో తెలియదు. దానికి రంగులు వేసే సరికి పూర్తి జీవం వస్తుంది ఏదైనా చిన్న విషయాన్ని గమనిస్తే కాగితం ఉండవలసిందే. దానిని గురించి తన అభిప్రాయాన్ని  కవితారూపంలో వెల్లడిస్తోంది. తెలియని విషయాల జోలికి వెళ్లదు. అలాంటిది ఒకసారి  వాయుపుత్రుడు చిత్రాన్ని చిత్రించి చూపించింది దీనికి తోక లేదు కదమ్మా ఆంజనేయస్వామికి తోక ఉండాలి కదా అంటే, వాలి లాంటి గర్వపోతులకు అవసరం తప్ప సాత్వికత్వానికి  మారుపేరుగా  వినయ విధేయ లతో ప్రవర్తించే మహానుభావునికి కావాలనే తోక పెట్టలేదు అన్నది.
ఇంత చిన్న వయసులో అంత పెద్ద విషయం ఎలా అవగాహన వచ్చిందో... రామాయణ కావ్యానికి  మూలమైన వాల్మీకిని గురించి ఎంత అద్భుతంగా ఇంత లోతుగా ఆలోచించిందా అనిపించింది. రామాయణంలో ఉన్న పేర్ల గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి పేర్లు పెట్టడంలో అసలు అర్థం  రామాయణం దగ్గర నుంచి  దశరథ మహారాజు మొదలు  దశకంఠుని వరకు ప్రతి పేరుకు అర్థం చెప్పి నన్ను ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ నేను అలా ఊహించలేదు  వాలి అంటే తోకలు, కొమ్ములు పెరిగిన అహంకార లక్షణాలు ఉన్నవాడు. సుగ్రీవుడికి  కంఠం బాగుంటుందని కాదు ఎవరితో ఎలా మాట్లాడాలో మాట విలువ ఏమిటో తెలిసినవాడు,  రామాయణం అంటే రాముడు చుట్టూ తిరిగే కథ కాదు  జటాయువు నుంచి త్రిజట వరకు అంటే జట అన్న దానికి అర్థం వేదం. దాని మూలం  పక్షి కూత సామవేదం.
త్రిజట అంటే వేదత్రయి  సామవేదాన్ని మూడు విభాగాలు చేసినది  కనుకనే అంత మంది రాక్షస స్త్రీల మధ్య  సీతమ్మ వారికి నచ్చిన ఏకైక వ్యక్తి  త్రిజట ఇంత చిన్న వయసులో అంత వేదాంతాన్ని భౌతికంగా నిర్వచించి చెప్పడం  సామాన్యులకు అసాధ్యం. ఇది సంచిత జన్మ ఫలితం అని నా విశ్వాసం. మేము చంటి పిల్లగా చూస్తున్న  డాక్టర్. స్వాతి ఇంత గొప్ప ఆలోచనా పరురాలు అయ్యిందని ఆశ్చర్యపడుతూ ఉంటాం. తనతో చెప్పలేదు. చెబితే కొమ్ములు మొలచి గర్వ పోతు  అవుతుందేమోనని భయం.
తన కళ్ళ ముందు ఎవరు కష్టపడుతున్నా ముందు తన కళ్ళు నీళ్ళతో నిండిపోతాయి  ఆ అనుభూతి జీవితంలో తనకు  వరం. కనుకనే  తన కవితలో మానసిక వేదనను కళ్లకు కట్టినట్లు చూపించ గలుగుతోంది లోతయిన అర్థం ఇచ్చే పదాలు వాడడం  ఆమెకు వెన్నతో పెట్టిన విద్య  ఏదైనా విషయాన్ని చెప్పాల్సి వస్తే దాన్ని అందంగా కథా రూపంలో నాటకీయత జోడించి చెప్పడం  చదువరులలో చదవాలన్న కాంక్షను రేకెత్తిస్తోంది. కనుకనే అద్భుతమైన అభ్యుదయ భావాలతో తనదైన శైలితో  ముందుకు సాగుతోంది మా చిన్నారి. అందుకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇంతకుమించిన పట్టుదలతో అంకితభావంతో ముందుకు సాగాలి అనేది నా ఆకాంక్ష. నా బంగారు తల్లి దానిని నిజం చేస్తుందన్న  నమ్మకం నాకుంది.
ఇంట్లో ఏ బిడ్డ (ఆడ గాని, మగ గాని)  పుట్టినా అది  శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమే. సమాజంలో  చెడ్డ వారిని శిక్షించడం, మంచి వారిని రక్షించడం చేసిన గొప్ప వ్యక్తి. అలాగే మా చిన్నారి  సమాజ శ్రేయస్సు కోరి  తన కవితలతో సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును రూపుమాపడానికి ఒక వైద్యురాలిగా రోగికి ఉన్న రుగ్మతను ఎలా తీసివేయాలో తెలిసిన వ్యక్తిగా ఈ సమాజంలో వున్న మూఢనమ్మాలను తీసివేయడానికి వచ్చిన  మా చిన్ని కృష్ణమ్మకు  ఈ కృష్ణాష్టమి రోజున మీ అందరి దీవెనలు కావాలని కోరుకుంటున్నాను.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Congratulations Dr Swathi