జీవితం విచిత్రాల చిట్టా మనసు ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నదో అన్ని రకాలుగా ప్రవర్తిస్తోంది. ఈ మనసు ఎలా ఉంటుందో మనం చెప్పలేము పసిగుడ్డును చంకన ఎత్తుకున్న తల్లి భోజనం చేస్తున్న సమయంలో ఆ బిడ్డ ఒకటికి వెళ్ళినా, రెంటికీ వెళ్ళినా తను భోజనం చేస్తూనే చీదరించుకోకుండా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటుంది. అదే వయసులో ఉన్నపరాయి వారి బిడ్డ చేస్తే అసహ్యించుకుని బయటికి పంపేవరకు నిద్రపోదు. ఒకేపనికి రెండు రకాలుగా ఆలోచించడం ఏమంత సమంజసం. నీ బిడ్డ నీకు ఎంత ముద్దో వారి బిడ్డ వారికి అంత ముద్దు కాదా అలా చూడలేకపోతే మానవత్వానికి అర్థం ఏముంది అంటాడు శ్రీనివాసరెడ్డి. అందరినీ సమానంగా చూసే రెడ్డి గారు సమయపాలనకు ప్రాధాన్యతనిస్తారు. ఒక్క క్షణం కూడా అనవసరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం నేను చూడలేదు. తన పేరుతో జరిగే కార్యక్రమం లో ఏవైనా సరే చెప్పిన సమయానికి చెప్పినట్లుగా జరిగి తీరాలి. ఆలస్యమైతే ఆయనకు నచ్చదు ఏ కార్యక్రమమైనా తనదైనా, పరాయి వారిదైనా పది పదిహేను నిమిషాల ముందు వెళ్ళడం ఆనవాయితీ అది పాటించలేదు అంటే జీవితంలో క్రమశిక్షణ లేదు అని అర్థం. ఈ విషయంలో నాకు మేడం గుర్తు వస్తోంది. సినీ రంగంలో భానుమతి గారిని ఎవరు పేరు పెట్టి పిలవరు. మేడం అంటారు ఆమె షూటింగ్ కు చిన్న నిర్మాత అయినా, పెద్ద నిర్మాత అయినా పది పదిహేను నిముషాలు ముందే వస్తోంది. ఆ సమయం దాటి మరో పది నిమిషాల వరకు పని ప్రారంభం కాకపోతే అక్కడ కుర్రవాడితో చెప్పి నేను టీ తాగి వచ్చాను అని నీ నిర్మాతకు చెప్పు అని వెళ్ళిపోతుంది. ఆ రోజు మళ్ళీ తిరిగి రాదు రెడ్డి గారికి ప్రత్యక్షంగా తెలుసు వారు కూడా దానిని పాటిస్తారు సమయానికి ప్రారంభించని కార్యక్రమాలు నుంచి, నాన్నగారూ బయటికి వెళ్లి కాఫీ తాగి వద్దాం అని నన్ను తీసుకెళతారు. తిన్నగ మా ఇంటికి వచ్చి కాలక్షేపం చేసి భోజనాలు అయిన తర్వాత వెళతారు. ఏమండీ ఈ సమయం అక్కడే గడపవచ్చు కదా పాపం వారు బాధపడతారుమో అని నేనంటే నిజంగా బాధపడేవాడు సమయాన్ని పాటించకపోతే పాటించేవాడు ఎంత బాధ పడతాడు ఆ మాత్రం ఆలోచనాశక్తి వారికి ఉండదా? అలా చేయండి అని హెచ్చరించడం కోసమే నేను ఈ పని చేస్తూ ఉంటాను మరో సారి చూడువాళ్ళు ఆలస్యం చేస్తారేమో అలా కొంతమందిని అయినా మార్చడం కోసం వారి ప్రయత్నం. ఒకరిని చూసి మరొకరు అలా చేస్తే కార్యక్రమానికి నిండుతనం వస్తుంది అనుకున్న సమయానికే వస్తారు ప్రేక్షకులు కూడా ముందే వస్తారు. అలా చేయడం వల్ల అందరికీ మంచే జరుగుతుంది కదా అని అలా చేస్తానని చెప్పారు శ్రీనివాస రెడ్డి.
క్రమశిక్షణకు మారుపేరు మా శ్రీనివాసుడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి