మంచి శిష్యుడు మా శ్రీనివాసుడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.

 శ్రీనివాస రెడ్డి లో నాకు  శ్రీరామచంద్రమూర్తి  శ్రీ కృష్ణ పరమాత్మ ఇద్దరూ కనిపిస్తారు. శ్రీరామునిలో ఉన్న  ఏకపత్నీ వ్రతాన్ని వారు చేసిన ధర్మ కార్యాలను గురువు గారి ద్వారా విని ఆకర్షితుడయ్యారు. దానిని జీవితంలో ఆచరిస్తున్నారు. శ్రీ కృష్ణుని చిలిపి చేష్టలు అన్నీ ఆయనకు బాగా ఇష్టం. దానిలో పాత్ర తీసుకోకుండా అందరినీ భాగస్వాములుగా చేసి తను వేరేగా వుండడం  వయోపరిమితి పట్టించుకోడు స్త్రీ, పురుష, బాల, వృద్ధ అన్న తేడా కనిపించదు. ఈ రెండు తత్త్వాలను సొంతం చేసుకున్నాడు శ్రీనివాస రెడ్డి. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. గురువు దగ్గర ఎంత విద్య నేర్చుకున్నాడో, సమాజాన్ని  చదివి అంతకుమించిన విజ్ఞానాన్ని సంపాదించాడు. ఏ విషయాల గురించి అయినా, తడుముకోకుండా సమాధానం చెప్పగల నేర్పరి. దానికి తగిన సమయస్ఫూర్తి ఉంది. ఒకరోజు మాటల సందర్భంలో తల్లీ భార్యల తత్వాలను గురించిన చర్చ వచ్చింది అటు ఆప్యాయంగా చూసిన అమ్మ ఉంది ఇటు మీ శరీరంలో సగ భాగమై ఆప్యాయంగా చూసుకుంటున్న భార్య ఉంది  ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అంటే మనం పుట్టక ముందు నుంచి మన జాతకాలు తెలిసింది అమ్మకే.  తొమ్మిది నెలలు మోసి  ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణం నుంచి ఆలనా పాలన చూసేది అమ్మే. మన అవసరం చిన్నదైనా, పెద్దదైనా  ఒప్పు చేసినా, తప్పు చేసినా  అమ్మ ఒడిలోతల పెట్టి  మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పేది అమ్మతోనే. నాన్నంటే పడకపోయినా అమ్మ దగ్గర ఉన్న చొరవ బిడ్డకు ఉండదు.  కానీ పుట్టినప్పట్నుంచీ  ఏ సమయానికి ఏది కావాలో ప్రతిదీ అమర్చేది అమ్మ  అలాంటి అమ్మ దేవత కాక  మరి ఏమిటి? భార్య  వివాహం అయ్యేంతవరకు  పుట్టింట్లో ఉండి అక్కకి పద్ధతులకు  అలవాటు పడి వస్తుంది. ఏ ఇంటిలోనైనా ఆడపిల్లను గారాబంగానే చూస్తారు.  ఇక్కడకు వచ్చిన తర్వాత వీరి అబ్బాయి మంచి వాడా, చెడ్డ వాడా అని ఎంతో అధ్యయనం చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది. అంతవరకు ఆమెను కొత్త వ్యక్తి గానే పరిగణిస్తారు ఆ కుటుంబీకులు. వీరిలో ఎవరు అందంగా ఉంటారు అని ఎవరిని అడిగినా అమ్మ అనే ఠక్కున చెప్పేస్తారు ప్రతివారు.  అక్కడ భౌతిక మైన అందం కాదు వాడు చూసేది  అమ్మ కమ్మటి మనస్సు భార్యఎంత అందంగా ఉన్నా  ఆమె మనసు ముందు నిలువదు. అలా నడవడానికి  చాలా సమయం పడుతుంది. వారు చేసిన వంటకాలలో ఎవరు చేసింది నీకు నచ్చుతుంది అనేదే నీ ప్రశ్న కచ్చితంగా అమ్మ చేసింది  దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి వాడి అభిరుచులకు అనుగుణంగా చేసేది అమ్మ దానిని కొనసాగించేది భార్య. కనుక ఇద్దరూ ఆ కుర్రవాడికి రెండు కళ్లు. ఆ రెండు కళ్ళ లో మీకు ఏది బాగుంది అంటే ఏమని చెప్తాం. ఆ రెండిట్లో ఏది లేకపోయినా  జీవితమంతా అంధ కారమవుతుంది. కనుక నాకు ఇద్దరూ ప్రాణమే అన్న వారి సమయస్పూర్తి  మా అందరికీ నచ్చింది. వారి గురించి రోజుకు రెండు మూడు  ఘట్టాలను రాయవచ్చు. కానీ మిగిలిన వారి గురించి కూడా  చెప్పాలని ఉంది కనుక  ప్రస్తుతానికి కామా పెడుతున్నాను. ఇది పుల్స్టాప్ కాదు. వారిని గురించి మళ్ళీ ముచ్చటించుకుందాం.
కామెంట్‌లు