రాఖీ రాఖీ రాఖీ
ఓహో చక్కని రాఖీ
చిక్కని బంధం చేకూర్చే బహు చక్కని రాఖీ
అందాల ఇంద్రధనుస్సువు నీవు
అనుబంధాల చంద్ర రేఖవు నీవు
అనురాగం వెన్నెల నీవు
మమతల మాణిక్యమే నీవు
ఆఁహాఁ.ఓహో రాఖీ.... రాఖీ...రాఖీ
అన్నా చెల్లెల మమకారం
అక్కా తమ్ముల ఆత్మీయం
కలబోసి కట్టే రక్షా బంధం
ప్రేమకు చిహ్నం ఈ రాఖీ
రాఖీ రాఖీ రాఖీ.. ఓ.....మెరిసే రాఖీ
తోబుట్టువుల పెన్నిధి రాఖీ
అన్నా చెల్లెల అక్కా తమ్ముల
అనురాగ బంధమే ఈ రాఖీ
ఆత్మీయ బంధమే ఈ రాఖీ
రాఖీ రాఖీ రాఖీ ఓ ఆనందాల రాఖీ
ఆకాశానికి అవని కట్టెను
హరివిల్లూ.....రాఖీ
అన్నకు చెల్లె ప్రేమతో కట్టెను అనురాగం.... రాఖీ
అక్క తమ్మునికి కట్టిన రాఖీ
ప్రేమానుబంధం.... రాఖీ
రాఖీ రాఖీ రాఖీ ఓహో చక్కని రాఖీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి