రాధా కృష్ణ(నానో కథ);-సుమ కైకాల
 "మన ప్రేమ అమరం...అలనాటి రాధాకృష్ణుల ప్రేమలా చరిత్రలో నిలిచిపోవాలన్నదే నా కోరిక" అరమోడ్పు కన్నులతో కృష్ణని చూస్తూ అంది ఈనాటి రాధ.
"నీ కోరిక అదే అయితే నేను కాదనగలనా? అలాగే చేద్దాం" అన్నాడు ఈనాటి కృష్ణ.
"చేద్దాం...ఏంటి కృష్ణా? ఉందాం అనాలి"
"మా ఇంట్లో మన ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా...ఇక చెప్పక్కరలేదు రాధా! రిలీఫ్ గా ఉంది " అన్నాడు.
"అదేంటి? ఎందుకు చెప్పక్కరలేదు కృష్ణా? " అయోమయంగా అంది రాధ.
"రాధాకృష్ణులు ప్రేమికులు మాత్రమే... మనమూ అలాగే ఉందాం" ఆనందంగా అన్నాడు కృష్ణ.
రాధ తేరుకోవడానికి సమయం పడుతుంది 😊

కామెంట్‌లు