విదర్బ రాజు విక్రమసేనుడు ఎంతో పరాక్రమ వంతుడు. తన పరాక్రమంతో సమస్యల్లో చిక్కుకున్న ఎన్నో రాజ్యాల రాజులను ఆపద సమయంలో ఆపద్బాంధవుడిలా రక్షించాడు. అందుకే ఆయనకు దానకర్ణుడు అనే పేరు వచ్చింది.
బయట పరదేశాధిపతులతో స్నేహం కారణంగా ఆయనకు శత్రువులే లేకుండాపోయారు.
ఎవరికి ఏ ఆపద వచ్చినా వారిని ఉదారంగా ఆదుకునేవాడు,. ఈ మూలాన తన రాజ్యంలో వున్న వనరులన్ని తగ్గిపోసాగాయి. దీన్ని పరిశీలించిన మంత్రి మల్లయ్య ‘‘ ప్రభూ! రాజ్యంలో ధన, కనక వస్తువులు తగ్గిపోతున్నాయి. మీ ఉదారతను కాస్త తగ్గించుకోండి.. లేదంటే మీకు కూడా మంచిది కాదు.. దేశ ప్రజలు, స్వయంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు..’’ అని హెచ్చరించాడు.
విక్రమసేనుడు వినిపించుకోలేదు. ఆర్థిక స్థితి దిగజారడం చూసి చక్కదిద్దే బాధ్యతను మంత్రి మల్లయ్య తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.
ఓ రోజు రాజులేని సమయంలో అత:పురంలో రాణి వాసంతిని కలిసి ఆర్థిక దుస్థితిపై చర్చించాడు. రాణి ఆందోళన చెంది పరిస్థితిని చక్కదిద్దాలని కోరింది.
ఒక ఒప్పందం ప్రకారం రాజుకు తెలియకుండా మంత్రిని మల్లయ్య, రాణి వాసంతిని కలిసి ఆర్థిక దుస్థితిని చక్కదిద్దాలని కోరింది రాణి.
తమ అంగీకారం ప్రకారం రాజుకు తెలియకుండా మంత్రి మల్లయ్య, రాణి వాసంతి రాజ్యోద్యోగులను అప్రమత్తం చేశారు. ఖజానాకు వచ్చే ఆదాయంలో సగభాగం సమీప కొండ కింద పెద్ద గోతితవ్వి అందులో దాచిపెట్టారు. రోజురోజుకు రాజ్యంలో ఆర్థిక స్థితి పతనమైంది. రాజు ఆందోళన చెంది ఆరోగ్యం క్షీణించింది. మంచం పట్టాడు. అది విని పక్క రాజ్యాధిపతులు విక్రమసేనుడి వద్దకు వచ్చారు. గతంలో ఆయన చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా ఒక్కో రాజ్యాధిపతి లక్ష వరహాలు ఇచ్చారు. విదర్భ రాజ్యానికి కొంత ఊరట లభించింది. ఆ నెల రాజ్యోద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలు చెల్లించారు. మరుసటి నెల మళ్లీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. రాజు ఏమి చేయాలా? అని ఆలోచిస్తున్న సమయంలో భార్య వాసంతి, మంత్రి మల్లన్న అక్కడికి వచ్చారు. తాము దాచి వుంచిన డబ్బు తెచ్చి రాజుకు ఇచ్చారు.
విక్రమ సేనుడు ఆశ్చర్యపోయాడు. ‘‘ ఇది ఎక్కడిదీ?’’ అని ప్రశ్నించాడు. తాము ముందు చూపుతో దాచిన సంగతి వివరించారు.
విక్రమ సేనుడికి పోతున్న ప్రాణాలు లేచివచ్చినట్లైంది. రాజ్యంలో ఆర్థిక స్థితిని చక్కదిద్దాడు. మితిమీరిన కరుణ తన ఉనికికే ముప్పు అని గ్రహించాడు. ముందు చూపుతో ఆలోచించి పొదుపు చేయడం అలవరుచుకున్నాడు. తనకు లక్ష వరహాలు ఇచ్చిన రాజులకు నగదు మొత్తం చెల్లించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ముందు చూపుతో ఆలోచిస్తూ పరిపాలన సాగించి ఆర్థికాభివృద్ధికి బాటలు వేశాడు.
ముందుచూపు;-- బోగా పురుషోత్తం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి