"ఓసారి ఘంటసాలవారు ఓ తమిళ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తమిళ కవి కె.పి. కామాక్షి అనే ఆయన పాట రాస్తున్నారు. ఆయనది చిత్రమైన వ్యక్తిత్వం. ఆయనకి అప్పటికే అరవై ఏళ్ళుంటాయి. గిరిజాల జుత్తు. పిచ్చికోటు. లుంగీ. ఇదీ ఆయన వేషం. ఏంటసాల కళ్యాణి రాగంలో తత్తకారంతో ఒక ట్యూన్ చేసి వినిపించారు. కవిగారు పాట రాయలేదు. తబలా వాయించారు. తరువాత స్వయంగా ఏదో పాడారు. తర్వాత మళ్ళీ రేపు వస్తానని వెళ్ళిపోయారు. ఇదే పద్ధతి రెండు మూడు రోజులు జరిగింది. చివరికి నిర్మాత, దర్శకుడుకవిగారిని పాట రాస్తారా లేదా అని నిలదీసేసరికి ఆయన ఆ ట్యూన్ ఏమిటీ?అని అడిగారు. ఘంటసాల పాట వినిపించారు. తాతానతానాననా (సాపామరీగనీరిగా) - వెంటనే కవిగారు తబలా వాయిస్తూనే పాడారు. సింగార సంగీతమే అని. పల్లవి అయిపోయింది. అలాగే చరణాలతో ఐదు నిముషాలలో పాట రచన పూర్తయింది. ఈ అనుభవం ఆనాటికి చాలా వింతయినది మాకు...."
- ఈ మాటలన్నీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి అత్యంత సన్నిహితులు పట్రాయని సంగీత రావుగారివి.
2021లో "పట్రాయని సంగీతరావుగారి రచనలు" అనే శీర్షికన వేసిన పుస్తకాన్ని వారి పుత్రుడు గోపి నాకు 21-10-21 న నాకు కానుకగా ఇచ్చాడు. తేదీ ఎంత బలే ఉంది.
సంగీతరావుగారిని మా నాన్నగారివల్ల ఎరుగుదును. మా ఇంటికి వచ్చేవారు. నేనూ వారింటికి వెళ్తుండేవాడిని. ఉస్మాన్ రోడ్డు (టీ. నగర్) లో ఘంటసాలగారింటి ఆవరణలో వెనుకవైపు వాటాలో ఉండేవారు. పేరుకు తగినట్టే ఆయన సంగీతస్వరూపులే. ఆయన మాటా పాటా ఎంత బాగుంటుందో. ఆయనకు సంగీతం మాత్రమే వచ్చనుకునేవాడిని. అందుకు కారణం, మా నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు వారి మధ్య ఎక్కువ భాగం మాటలు సంగీతపరంగానే ఉండేవి. కానీ ఆయన మంచి రచయిత కూడా అన్న నిజం ఈ గొప్ప పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. అక్షరాలా వంద వసంతాలు చూసిన ఆయన జ్ఞాపకాలు అమోఘం. వాటిలో ఒకటే ఈ వ్యాసం ప్రారంభంలోని కొన్ని మాటలు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలవి. అందులో ఆయన ప్రస్తావించిన తమిళ కవి కె.పి. కామాక్షి అనే పేరు నేనిప్పుడే వినడం. "కామాక్షి" సినీకవి అని తెలియడంతో కొన్ని వివరాలు తెలుసుకో వాలనిపించి ఓ తమిళ మిత్రుడితో మాట్లాడాను. అతను "కామాక్షి" గురించి కొన్ని వివరాలు చెప్పాడు.
కామాక్షి వొట్టి కవి మాత్రమే కాడు. నటుడు కూడా.
తమిళ సినీ చరిత్రలో తన పాటలతో ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కవి చక్రవర్తి కన్నదాసన్ కన్నా ముందుతరం కవి కామాక్షి. ఆయన పూర్తి పేరు కె.పి. కామాక్షి సుందరం.
స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో ఎందరో ప్రతిభావంతులైన రంగస్థల నటులుండే వారు. వారిలో కామాక్షి ఒకరు. అలనాటి ప్రముఖ "బాయ్స్ నాటక సంస్థ" లో ఆయన ఏడ ఏట చేరి వెయ్యికి పైగా నాటకాల్లో నటించి గొప్ప కళాకారుడిగా మన్నలు పొందారు.
కామాక్షి తమిళ టాకీ సినిమా ఆరంభకాలంలో మార్గదర్శిగా ఉన్నారు. విలన్ పాత్రల ద్వారా విశేష గుర్తింపు పొందిన కామాక్షిని బాలయ్య అనే నటుడికి దిక్సూచిలాంటివారని చెప్పుకునేవారు.
1936లో పతిభక్తి అనే సినిమాతోనే కామాక్షి సినీ రంగప్రవేశం చేశారు. మదురై ఒరిజినల్ బాయిస్ కంపెనీ (నాటక సంస్థ) నిర్మించిన చిత్రం. ఈ సినిమా విడుదలైన 1936లోనే సతీలీలావతి అనే సినిమాకూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాల కథా దాదాపుగా ఒకటే కావడంతో నిర్మాతలు కోర్టుకెక్కారు. తమిళ సినీ చరిత్రలో కోర్టులో విచారణ జరిగిన తొలి కేసు ఇదే. అలాగే పతిభక్తి సినిమాలోనే క్లబ్ డ్యాన్స్ సన్నివేశంకూడా తొలిసారిగా చిత్రీకరించారు. ఇంకొక విశేషమేమిటంటే, ఈ సినిమా 1936లో వస్తే మద్రాసు ఆలిండియా రేడియో 1938 జూన్ 16న ప్రారంభమైంది.
1941లో కళైవానర్ ఎన్ . ఎస్. కృష్ణన్ అలీబాబాగా నటించిన "అలీబాబావుం 40 తిరుడర్గళుం" ఆనే సినిమాలో దోపిడీ ముఠా నాయకుడిగా కామాక్షి నటించి ఎనలేని గుర్తింపుపొందారు. మొత్తం పదిహేను పాటలున్న ఈ అలీబాబా సినిమాలో కామాక్షి, యానై వైద్యనాథయ్యర్ పాటలు రాశారు. ఎన్.ఎస్. బాలకృష్ణన్ సంగీతం సమకూర్చారు. 1941 మార్చి 15న విడుదలైన ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు.ఈ సినిమా ప్రతులూ దొరకలేదు.
కళైంజ్ఞర్ ఎం. కరుణానిధి పదునైన సంభాషణలతో వెండితెరకెక్కిన పరాశక్తి సినిమాలో కామాక్షి పూజారిగా నటించారు.
1952లో ఎల్.పి.ఎ. పెరుమాళ్ ముదలి యార్ నిర్మించిన ఈ "పరాశక్తి" తోనే శివాజీగణేశన్ సినీరంగప్రవేశం చేశారు.
అనంతరం గేయరచయితగా మారి జనాదరణ పాటలు రాసిన కామాక్షికి అలనాటి సుప్రసిద్ధ కవి కంబదాసన్ తో మంచి స్నేహముండేది. కంబదాసన్ కూడా ముందుతరం సినీ కవి. రచయిత. దక్షిణార్కాటు జిల్లాలోని ఉలగాపురం అనే గ్రామంలో సుబ్బరాయర్ - బాలమ్మాళ్ దంపతులకు 1916 సెప్టెంబరులో జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు అప్పావు. అయితే అందరూ ముద్దుగా రాజప్పా అని పిలిచేవారు. తమిళ కవి కంబర్ మీది మక్కువతో ఈయన తన పేరుని కంబదాసన్ అని మార్చుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి