సుప్రభాత కవిత ; -బృంద
అలలు ఎన్ని వచ్చి పోయినా
సముద్రం ఒకటే!

అక్కడే పుట్టి పరుగులుతీసి
అక్కడే కలిసి పోయే అలలు

కడలి నుండీ వేరు కాలేవు
వదిలిపోయే ప్రయత్నం మానలేవు

మనమూ జీవితంలో
విషయాల వెంట పరుగులు

తిరిగి ప్రశాంతంగా  మనలో
మనము..

కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి
కొన్ని కొంతకాలం
మరికొన్ని ఇంకొంచెం ఎక్కువ సమయం...

కలతపెట్టే వేదనలు
కదిలించే సంఘటనలు

ఏవి ఎన్ని వచ్చినా
దానితో అలాగే సాగి మళ్ళీ 
మొదటికే వచ్చేయాలి.

ఏదీ శాశ్వతం కాదు
మంచైనా! చెడైనా!

మనసుకు శిక్షణ ఇవ్వాలి
దేనికీ బెదిరి చెదిరిపోకుండా!

మనకోసం కేటాయించినవి
మనమే అనుభవించాలి.

మన ఉదయాలు 
మన హృదయాలు

ఆనందంగా మలచుకోవడం
మన చేతిలో పనే!

అందమైన అనుభూతుల
అరవిరిసిన సంపెంగ గుత్తులు
తెచ్చే ఆనందమైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు