దేహధారులకు
కంటికి అందము
వంటికి ఆరోగ్యము
మనసుకు ఆనందము
చాలవా!
సుఖజీవనానికి
ఉండటానికి కుటీరము
పరుండటానికి మంచము
అనుకూలమైన పరిసరము
చాలవా!
సమాజములో నిలబడటానికి
తోడుకు సత్కళత్రము
వంశోద్ధరణకు సత్సంతానము
సలహాసంప్రదింపులకు ఒకనేస్తము
చాలరా!
బ్రతకటానికి
తినటానికి ఆహారము
త్రాగటానికి జలము
గుండెనాడించుటకు అనిలము
చాలవా!
సంసారసాగరాన్ని ఈదుటకు
సంపాదనకు చిరుఉద్యోగము
అవసరాలకు సరిపడుఅదాయము
చేరటానికి జీవితలక్ష్యము
చాలవా!
కవనానికి
మనసున భావము
చేతిన కలము
వ్రాయుటకు కాగితము
చాలవా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి