సుప్రభాత కవిత ;-బృంద
సాగిపోయే వాగులాగే
ఆగిపోనిది కాలము.

గుండెకెన్ని గాయాలైనా
తెలియనివ్వదు మోము.

చిరునవ్వుల వెలుగులలో
దాచివుంచే కలతలు

నిట్టూర్పుల  వెంట సాగె
నిరాశల మూలుగులు.

కలిసిపోవు కలవరాలు
కనికరించని సమయాలు

కలిసి సాగు కాలువలు
ఆత్మీయ అనుబంధాలు.

ఏది  ఎపుడు కలిసేనో!
ఎంత వరకు తోడౌనో!

తెలిసీ మనసు పెంచుకునే
మమతలన్నీ మౌనాలే!

అనుభవాల బరువుతో
అనుబంధాల  గొలుసులతో
అందమైన బంధమే
ప్రాప్తించిన జీవితం

చిన్న చిన్న తరగలే
చిన్ని చిన్ని సంతోషాలు

కొన్నైనా వదలక 
కొంగున మూటకట్టుకోవాలి.

చిట్టి ఆనందాల చక్కటి మోపును
తెచ్చి మనకందించే చల్లనైన
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు