ఒంటరి తనం...తుంటరితనం
******
ఒంటరి తనం మనసుకు కలిగిన ఏకాకితనం,శూన్యావస్థ.
మనసు ఓ చోట నిలకడగా లేకుండా ఆకతాయితనంతో ఇతరులకు చీకాకు పెట్టించే స్వభావమే తుంటరితనం.
ఒంటరితనం,తుంటరితనం...రెండూ వ్యక్తిగతంగా, సామాజికంగా హానికరమైనవే.
ఒంటరి తనం మనిషిని ఓ ఉద్వేగభరితమైన స్థితికి నెట్టేస్తుంది.
ఆత్మ న్యూనతా భావాన్నో లేక సమాజం మీద కసినో పెంచి అనర్థాలకు దారి తీయిస్తుంది.
తుంటరి తనం సరదాతో కూడి వుంటే ఫరవా లేదు.కానీ అతి అయితే మాత్రం ఇతరుల హృదయాలను గాయపరుస్తుంది.
ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నలుగురితో కలిసి సమాజ సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసును ఖాళీగా ఉండనీయకుండా పరోపకార చింతన,సత్ గ్రంథ పఠనం, నూతన ఆవిష్కరణల ఆలోచన చేయాలి.
అప్పుడే ఒంటరి తనం సమాజ శ్రేయస్సుకు దారి తీస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి