శ్రీకృష్ణజన్మాష్టమి ప్రత్యేక గీతం!
======================
సాకీ :-
కృష్ణా...... కృష్ణా.... శ్రీకృష్ణా....
ఎన్నిమార్లు పిలిచినా....
ఎన్నెన్నిమార్లు తలచినా....
తనివి తీరదు, మాకు
తృప్తి కలుగదూ...... !
పల్లవి, :-
ధర్మము నిల నిలుపగ వెలసిన
భగ వానుడ వీవయ్య... !
ద్వాపరయుగమున అవతరిం చిన కృష్ణుడ వీవయ్యా.....
శ్రీకృష్ణుడ వీవయ్యా..... !
" ధర్మము నిల నిలుపగ... "
అనుపల్లవి :-
శిష్టుల కష్ట సిద్దులనొసగి...
దుష్ట దనుజులను దునుమాడ
అష్టమినాడు పుట్టితివి....
నీవు అష్టమి నాడుపుట్టితివి
ఆశ్రీతుల కష్టములన్నీ దీర్చితివి
కష్టములన్నీ దీర్చితివీ.... !!
"ధర్మము నిల నిలుపగ..."
చరణం :-
స్నేహమున కెంతొ విలువను ఇచ్చి... కుచేలునే బ్రోచితివి
నీవు కుచేలునే బ్రోచితివీ...
ఆర్తితో నిన్ను పిలిచినంతనే
ద్రౌపది మానము గాచితివి
నీవు ద్రౌపదిమానము గాచితివీ
"ధర్మము నిల నిలుపగ..."
చరణం :-
అద్భుత గీతను బోధించిన ఆ చార్యుడ వీవయ్యా....
ఆచార్యుడవీవయ్యా... !
జన్మ కర్తవ్యమునుఎరిగించిన
సద్గురువువు నీవయ్యా... !
జగద్గురువువు నీవయ్యా... !!
కృష్ణం వందే జగద్గురుమ్...
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్...
కృష్ణం వందే జగద్గురుమ్...
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్.. !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి