ఎంతబాగుండు!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఈ బొమ్మకు
రంగులు అద్ది మెరుగులుదిద్దితే
ఎంతబాగుండు

ఈ అందాలబొమ్మకు
ప్రాణంపోస్తే
ఎంతబాగుండు

ఈ బంగరుబొమ్మ
కళ్ళముందుకొస్తే
ఎంతబాగుండు

ఈ వయ్యారాలబొమ్మ
చిరునవ్వులు చిందిస్తే
ఎంతబాగుండు

ఈ ముద్దుబొమ్మ
దగ్గరకుపిలిస్తే
ఎంతబాగుండు

ఈ సొగసైనబొమ్మ
నను పలుకరిస్తే
ఎంతబాగుండు

ఈ కమ్మనిబొమ్మ
నా తోడుకువస్తే
ఎంతబాగుండు

ఈ బొమ్మకు
ప్రాణంపోస్తా
మాటలు నేర్పుతా

ఈబొమ్మ
మోమును వెలిగిస్తా
మదిని ఆనందపరుస్తా

ఈ బొమ్మను
వర్ణిస్తా
అందరికిచూపుతా

ఈ బొమ్మపై
చక్కనికవితను వ్రాస్తా
నలుగురిచేత చదివిస్తా


కామెంట్‌లు