ఈ తీరే భేష్!;-- యామిజాల జగదీశ్
 అమెరికాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థినీవిద్యార్థులకు ఓ విషయాన్ని తప్పనిసరిగా నేర్పిస్తున్నారు.
అదేంటంటే, 
ఇద్దరు పిల్లల మధ్య పోటీ అనుకోండీ. ఆ పోటీలో ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం తప్పదు.
గెలుపొందిన వారు నేనే గెలిచాననో, ఓడిపోయినవారు నేనోడిపోయాననో చెప్పకూడదు.
ఇద్దరూ కరచాలనం చేసుకోవాలి. ఆట బాగుంది కదూ అనే చెప్పాలి.
చిన్న వయస్సులోనే విజయ గర్వమో, పరాజయ బాధో మనసులో రానివ్వకూడదు. అందుకోసమే గెలిచాననో ఓడిపోయాననో కాకుండా ఆట బాగుంది కదా అనే అనుకోవాలి తప్ప నేనే గొప్పనో నువ్వు తక్కువనో మాటలు రాకూడదు. ఓడినా గెలిచినా ఇద్దరిలోనూ అణకువ, పట్టుదల, అంకితభావం ముఖ్యమనే రీతిలో మానసికస్థితి ఉండాలన్నది అక్కడి యాజమాన్య వైఖరి. ఇచ్చిపుచ్చుకోవడంలోని ఆనందం ప్రధానమని వారి అభిప్రాయం. 
ఎంత బాగుందో కదూ!!

కామెంట్‌లు