అందరికీ ; - డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్

 చక్కనైన చందాయీ
నా చేతికందుతుందా
చల్లని వెన్నెల పరుచుకుందీ
చక్కని హాయిని పెంచుతోందీ
వెన్నెల్లోని ఆటపాటలూ
కథలూ కబుర్లు మాటలు
బాబూపాపల ఆనందాలు
చిట్టితల్లుల కేరింతాలు
తాతాబామ్మల సంతోషాలు
అమ్మానాన్నల తాయిలాలు
అల్లరి చేస్తే అన్నీ నాకే
అల్లరి మానితె అందరికీ !!
కామెంట్‌లు