మత సారాంశం;-సుమ కైకాల
ఒక మతం ఎక్కువ
ఒక మతం తక్కువా కాదు
అన్ని మతాల అంతిమ
భావన ఒక్కటే...

అన్ని మతాల మూలాలను
ఆధ్యాత్మిక భావనల్ని
లోతుగా అర్థం చేసుకుంటే
మతాల మధ్య భేదం కనపడదు...

విభిన్న మతాలు నదీ తీరంలో
నిలిచే నావల వంటివి 
నదిని దాటడానికి నావ అవసరం
జీవితమనే నదిని దాటడానికి
మతాన్ని అనుసరించడం అవసరం...

తన మతం పట్ల విశ్వాసం
పెంచుకున్నప్పుడు
ఇతర మతాలను అవమానించే
ప్రశ్న ఎదురవదు 
అప్పుడే ఇతర మతాలను
గౌరవించే స్థాయికి ఎదుగగలము...

పరమత సహనం అందరికీ అవసరం
మతమేదైనా ప్రార్థించే దేవుడొక్కడే
విభిన్న మతాల సమాహారం
జనావళికెంతో ఆనందదాయకం...

నవ భారత నిర్మాణానికి
సర్వ మానవ సౌభ్రాతృత్వానికి
అన్ని మతాలు ఒకేలా ఉపకరిస్తాయని
గ్రహించడమే లౌకికత్వం !..

కామెంట్‌లు