యశోద కృష్ణ ;-ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
============
అల్లరివాడా నావల్లకాదిక 
ఎల్లరువచ్చి  తగవులాడేరిక 
చల్లలవెన్నలు దోచినతీరిక 
హవ్వ గోపకులం నవ్వేనిక
చెవ్వులుమెలేసే యశోదక్క ఉమ !

ఒక్కటి కాదమ్మా వెన్నునిలీల 
చక్కని   వాడే ఏమిటీ గోల
యమునాతీరo కోలాటాల
టక్కరివాడే కొంగులా గేల 
ఒక్కటి వేయాలి చెంపకిల ఉమ!

 వెన్న ఉండలు కమ్మగ ఉండే 
చిన్నిలేగలు నీతోటి ఆడే 
పాలబువ్వలే పాయసముండే 
చేలమునిండా చెరుకులుండే 
మన్నుతినకుర మాకన్నడే ఉమ!

గొల్లపడుచుల అద్దాల చీరలు 
కొల్లగొడితివటా అల్లరిపనులు 
అందుకున్నడే ఉట్టిన దుత్తలు 
నెమలీకచూడే అబ్బా సోకులు 
పిల్లనగ్రోవివినే  గోపికలు ఉమ!

కామెంట్‌లు