"ఒరే!అస్తమానం ఆ టి.వి.ఎందుకు?అంతకన్నా వింత నాబాల్యం లో విశేషాలు చెప్తా"తాత పిలుపుతో పిల్లలు అంతా వచ్చారు.తాత చెప్పసాగారు "మాతాత గారు మంచి పేరున్న వకీలు.డబ్బు కోసం పండించేవారు కాదు ఆయన. రకరకాల కులమతాలవారు వచ్చేవారు.ఓపెద్ద గదిలో చాపలు ఉండేవి.త్వరగా వచ్చిన కేసుపార్టీలవారు విశ్రాంతి తీసుకొనేవారు. పొరుగూరి నించి దెయ్యాల ఆచారి వచ్చేవాడు. నుదుట విభూది పెద్ద కుంకం బొట్టు మెడలో పెద్ద రుద్రాక్షలమాలలతో మహాభయంకరంగా కన్పడేవాడు.ఆయన్ని చూస్తూనే పిల్లిని చూసిన ఎలుకల్లాగా పారిపోయేవారం.కోర్టు కేసు వ్యవహారం కోసం ఆరునెలల గా వస్తున్నాడు."పంతులు గారు! నేను దెయ్యం భూతం పేరు తో నెలకి రెండు వందలు సంపాదిస్తా!కష్టపడి గుమాస్తా గా పనిచేశాను.ఇరవై రూపాయలు ఇచ్చేవారు ఐదుచోట్ల పనిచేస్తే! ఇప్పుడు ఇంట్లో కూచుని సంపాదిస్తున్నా"అని చెప్పాడు.
మాపెద్దమామయ్య బక్కగా ఉండేవాడు. ఎసెల్సీ చదువుతో రోగంతో బాధ పడేవాడు.ఆఆచారి మామయ్య ను పొయ్యికి దూరం గా కూచోపెట్టి పెనంవేడిచేసి దానిపై నీరు చిలకరించాడు.ముత్యాల లాగా నీరు గిర గిర తిరగసాగింది.నిన్ను పట్టిన దెయ్యం వదిలిపోతోందిరా అబ్బాయి!బాగా చదువు. పాస్ అవుతావు"అని మెళ్ళో తాయెత్తు కట్టాడు. మంత్రించిన నిమ్మకాయలు రోజూ రెండు పూటలా రసం తీసుకుని తాగమన్నాడు.అంతే!మామయ్య ఉషారుగా తయారైనాడు.అలా దెయ్యాల ఆచారి ట్రిక్ పనిచేసింది. "తాత కథ పూర్తి చేశాడు. "ఆయన చేసింది ట్రిక్ అని ఎలా తెలుసు?" పిల్లల ప్రశ్నలకు తాత జవాబు ఇది."వేడిపెనం పై నీరు చిలకరిస్తే నీటిబిందువులు ముత్యాలలాగా గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. మామయ్య కి చదువు టెన్షన్! మాతాతగారు మార్కులు తక్కువ వస్తే కర్రతో బాదేవారు.అందుకే భయంతో సుస్తీ జ్వరం తో ఎసెల్సీ పరీక్షలు అంటే హడిలి పోయాడు. ఆరోజుల్లో ఒక్క సబ్జక్ట్ లో ఫెయిలైతే ఏడాది అంతా దండగ ! అలా తాయెత్తు నిమ్మరసం తాగిస్తూ సత్తువ పెంచుకున్న మామయ్య ఎసెల్సీ పాసైనాడు.తాత దగ్గరికి వచ్చే కేసులవారు దెయ్యాల ఆచారి భక్తులైనారు.ఆయన కి నిజంగా శక్తి ఉంటే తన కేసుకోసం వకీలు ని ఆశ్రయించనవసరం లేదు. "తాత మాటలకు ఆలోచన లో పడ్డారు పిల్లలు 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి