సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 మెలుగు... వెలుగు 
   *****
మెలుగు...వెలుగులో మన అందమైన జీవితం నిబిడీకృతమై ఉంది
అందరితో ఆత్మీయంగా తలలో నాలుకలా, అభిమానంతో మెలిగితే, అదే  వ్యక్తిత్వానికి అద్భుతమైన అలంకారమై, ఆత్మ తృప్తి గల ఆనందాన్ని ఇస్తుంది.
ఆ ఆనందమే ఎదలో సంతోష దీపమై  లోలోపల వ్యధల చీకట్లను పారద్రోలి,మనశ్శరీరాలను ప్రకాశవంతంగా ఉంచుతుంది.
 ఆ ప్రకాశవంతమైన మనసే,పదుగురికి ఆదర్శంగా నిలిచి,వెలుగులు పంచుతుంది..
మనలోని ఆ వెలుగు చుట్టుపక్కల వారితో మెలిగే తీరే కష్ట, సుఖాల్లో ఆదుకునేలా చేస్తుంది.
ప్రజ్వలించే ఆ జ్యోతి వెలుగులో,కష్ట సుఖాల కావడిని, బాధ్యతల భుజంపై అలవోకగా మోయగల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది...
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు