జిల్లా :రాష్ట్రస్థాయిలో వికసించిన వికారాబాద్ కవితా కుసుమాలు*;-వెంకట్ ప్రతినిధి వికారాబాద్




 - జిల్లా నుంచి 15 మంది బాల కవయిత్రులు
- ఎస్ ఎల్ బి విద్యార్థుల ప్రత్యేక కవితలకు ప్రశంసలు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పాల కవి సమ్మేళనం లో వికారాబాద్ తమ కవితలతో వికసించారు. గత మూడు రోజులుగా హైదరాబాదులోని తెలంగాణ సరస్వత పరిషత్తులో జరుగుతున్న "భావి గళాలు జాగ్రత్త కలాలు" అనే స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రస్థాయిలో 500 మంది బాలకవి బృహత్ సమ్మేళనంలో జిల్లా నుంచి ఆయా పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థినులు పాలకవులుగా కవితలు రాసి ప్రశంసలు పొందారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ తదితరుల చేతుల మీదుగా వ్యక్తిగతంగా వర్షం శాపత్రాలు సన్మానాలు జ్ఞాపకాలు అందుకున్నారు. వీరిలో  సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు కే నందిని, శ్వేత ,అశ్విని, వాసిక స్పందన, ప్రశాంతి నవ్య వెన్నెల, పీజీ నందిని పాల్గొని ప్రశంసలందుకున్నారు. బంటారం గురుకుల కు చెందిన జగ్జీవని, అలాగే తాండూర్ పాఠశాల చెందిన కే.శ్రావ్య, విద్యార్థినిలు చెన్గోములకు చెందిన  టీ పావని, కే నీరజ పాల్గొని సన్మానం ప్రశంస పత్రాలు జ్ఞాపకాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ తాండూర్ కోఆర్డినేటర్ ప్రతినిధి దత్తాత్రేయ శ్రీనివాస్ ఉపాధ్యాయులు అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు