నవ్వలేక... ఏడవ లేక ;-కోరాడ నరసింహా రావు.
పుణ్యగిరులు,పవిత్రఝరులు...ఋషులు,యోగులు,జ్ఞానులతో... సిరి, సంపదల తులతూగి
నట్టి...ఘనచరితగల మన దేశా న్ని  దోచుకోని పరదేశు లెవ్వరు!
ఈ అర్భకులను, అమాయకుల ను  పీడించనిప్రభువులెక్కడ!?

వదలక పీల్చి పిప్పిచేసిన... ఆ తెల్లజలగలనువదిలించుకొనగ
అటుఅతివాదులు,ఇటు మిత వాదులు... దేశమంతా ఒకటై నిలిచి... అహర్నిశలు పోరును సలిపి,అమరవీరులై,ప్రాణాలొ దలగ ... సత్యమహింసలతో స్వాతంత్య్రంసాధించేశామని....సంబరపడిపోయాంగానీ.......,

సువిశాల అఖండ భారతావని ని, రెండుముక్కలుగ చేసి ఆనా డే వెక్కిరించిందిస్వాతంత్య్రం !
అధికారంకోసం కుమ్ములాటలు కుతంత్రాలు మొదలైనవీ ......  ఆనాడే  !

స్వతంత్రమొచ్చీ  డెబ్బది ఐదు 
సంవత్సరములు ఐనవిగానీ... 
కలలుగన్న సమసమాజంకలగా  
మిగిలెను ఈనాటికీ.... !!

 పేద - గొప్ప తారతమ్యం పోక పోగ, మరింత పెరిగె... !
. మతము పేర మారణహోమం
కులంపేర రక్త పాతం..హింసా-
దౌర్జన్యం...దోపిడీలు- లూటీలు 
హత్యలూ - మానభంగాలు... 
అవినీతిస్వైరవిహారం,అరాచకం ప్రబలిపోయెను... !
గోడమీద పిల్లుల్లా...ప్రజానాయ కులు,కక్షసాధింపురాజకీయాలు !
  లైసెన్సులతో.... ఏరులై పారె  బ్రాoదీ, విస్కీలు... !
 మాదకాలమత్తులోనిర్వీర్యులై 
  జోగే యువతరం !! సామ్రాజ్య  వాదయుద్ధోన్మాదం,సరిహద్దుల్లోశత్రుమూకలకుతంత్రవ్యూహం...,విజృంభించేవింతరోగాలు,ప్రకృతి వైపరీత్యాలు...!!
  భారతస్వతంత్రఅమృతోత్సవ 
వేడుకలని విని...అలసి,సొలసి
నీరసించిన భారత జనని.... 
 దీనంగా చూస్తూఉన్నది... 
   నవ్వలేక - ఏడవ లేక !!
    ******

కామెంట్‌లు