ఈ సృష్టిని మొత్తం ఆ భగవంతుడు సృష్టించాడని మన వేద శాస్త్రాలు బోధిస్తున్నాయి. అట్లే ఈ సృష్టిలో అంతర్భాగమైన అన్ని జంతువులు, క్రిమికీటకాదులు కూడా ఆ భగవంతుని సృష్టి కనుక వాటి పట్ల సమ భావన కలిగి ఉండాలని, మన సహచరులైన మానవుల పట్ల కుల, మత, ప్రాంతీయ, పేదా గొప్పా, అందమైన వారు, అందవిహీనమైన వారు అన్న బేధ భావం ఉండరాదని కూడా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని సూటిగా చెప్పే ఒక గొప్ప కధ శ్రీ సాయి సచ్చరిత్రలో వుంది.
ఒక సందర్భం లో శ్రీ శిరిడీ సాయిబాబా తన ప్రియ శిష్యుడు నానా సాహెబ్ చందోర్కర్ తో " నీ ఇంటి గడపలోకి ఎవరైనా వచ్చి సాయం అడిగితే నీ శక్తి సామర్ధ్యాల మేరకు వారికి దానమిచ్చి పంపు. ఏమీ లేకపోతే కనీసం రెండు మంచి మాటలైనా చెప్పు” అని సలహా ఇచ్చారు.అలాగేనని నానా తలూపి వెళ్ళిపోయాడు .నాలుగు రోజుల తర్వాత అతని ఇంటికి ఒక ముసలావిడ వచ్చి కాస్త అన్నం వుంటే పెట్టమని అడిగింది.ఇంట్లో పెట్టేందుకు ఏమీ లేదని నానా పనిమనిషి ఆ ముసలిదానిని పంపించబోయింది కాని ఆ ముదుసలి ఏమైనా పెడితే కాని వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. ఇంతలో ఇంట్లోంచి నానా వచ్చి ఎవడబ్బ సొమ్మని నా ఇంట్లోకి వచ్చి బిచ్చమడుగుతున్నావని పెద్దగా తిట్టి ఆమెను మెడ బట్టి గెంటేసాడు.
నానా కొంతకాలానికి శిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నప్పుడు “ నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెడ బట్టి బయటకు గెంటేసావెందుకు?” అని అడిగారు.
బాబా మాటలకు నానా ఆశ్చర్యపోయాడు. తను తన సమర్ధ సద్గురువైన బాబా ను బయటకు పంపించడమేమిటీ అని ఎంత తల పగల కొట్టుకుని ఆలోచించినా అర్ధం కాలేదు.
“నేను బిచ్చగత్తె రూపం లో నీ ఇంటికి వచ్చినప్పుడు నెను నీకు ఉపదేశించిన సలహాలు మరిచిపోయి నీళ్లైనా ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా తరిమేసావు. సాయి రూపం లో వున్న నాకు పంచ భక్ష్య పరమాన్నాలు పెడతావు, కాని ముసలి రూపంలో వస్తే దూషిస్తావు. ఇంకెప్పుడు నా తత్వాన్ని అర్ధం చేసుకుంటావు ? “ అని సాయి అడిగేసరికి నానా సిగ్గుతో తల వంచుకున్నాడు.
“మనుష్యులైనా, జంతువులైనా, క్రిమి కిటకాదులైనా ౠణానుబంధం వలనే మన వద్దకు వస్తారు. మన శక్తిని బట్టి వారిని ఆదరించాలి కానీ చీదరించు కోకూడదు. ఒకవేళ ఇచ్చేందుకు ఏమీ లేకపోతే అదే మాట సౌమ్యంగా చెప్పాలి గాని చీదరించు కోకూడదు. ఒకరు మరొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది. సర్వ జీవ సమనత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం త్రికరణ శుద్ధిగా ఆచరించువారు నాకెంతో ఇష్టులు “ అని శ్రీ సాయి ఒక అద్భుతమైన బోధ చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి