చిత్రకవిత :- ఆనైజమేలాపోతుంది.... !? కోరాడ నరసింహా రావు !

 జీవితాలు నిస్వార్థ సేవల కే 
అంకితమైన తరువులు... !
ఆకులురాలి, ఎండి, మోడుల్లా తయారైనా...ఇంకా మిగిలిఉన్న దేదో పొందాలనే ధ్యాసే... !!
అందుకోటానికి చెయ్యి చాచే... 
కృతఘ్నతా బుద్దే... 
   కని, పెంచి, పెద్దవాళ్ళను చేసి 
ప్రయోజకులుగా తీర్చి దిద్దిన.... 
తల్లి దండ్రులు...వయసుడిగి,  శక్తిచల్లారి,నీరసించి... చతికిల బడిఆదరణకోసంఎదురుచూసే
సమయంలోనూ...వాళ్ళనుపట్టించుకొనకపోగా...నాకెంతిస్తావు ? ఏమిస్తావని చెయ్యిచాచే  
బిడ్డలు కదూ...      ఆనైజమేలాపోతుంది... !?
కామెంట్‌లు