బ్రవున్ పేపర్లతో కుట్టిన
సిరా పీల్చే నోట్స్ కాదు..
తెల్లని కొత్త నోటు పుస్తకాలు కొనాలి..
పెన్నులో సిరా కక్కరాదు
వానలో బడికి చిన్ని గొడుగు
సొంతంగా కావాలి..
అమ్మ మర్చిపోయి ఉతకనప్పుడు..,
మూడో యూనిఫామ్ జత సిద్ధంగా ఉండాలి !
బాల్యం లో కోరికల చిట్టా !
ఊహల గువ్వల విహారంలో
స్థాయి బేధం తెలిసాక..
ఇతరుల్లా ఉండాలనే ఆశకి
ఫుల్ స్టాప్ పెట్టి,
ఉన్నదాంతో సర్దుకుపోయే తత్వం
జీవనపోరాటానికి ఋజువు !
ఒకటి మాత్రం సత్యం
కోరుకున్నది దొరకడం కష్టం..
లభించింది నచ్చలేదనడం పిచ్చి
కోరింది దొరికేవరకూ ప్రయత్నలోపం వద్దు
ఆశల ఆరాటానికి నువ్వో తరాజువి...
ఏది కావాలి ఏది వద్దు తుదినిర్ణయంలో !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి