"నవదుర్గామాతస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్==చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
శక్తితోడనువిశ్వమ్ముస్థాపితమొన
రింపజేసియుకూష్మాండరిపులద్రుంచి
అర్కునకువెల్గునిచ్చెనునమ్మదుర్గ
పూజలొనరించప్రాప్తించుపుణ్యమెపుడు!!!

02.
తే.గీ.
పేదరికమునుతొలగించిపెన్నిధియయి
సకలసౌభాగ్యములతోడసంపదలను
అందియిచ్చునుప్రేమగాననవరతము
కరుణజూపించుమనయందుకల్పవల్లి!!!

03.
తే.గీ.
నిలుపుకొనవలెమనముననిష్ఠతోడ
జన్మజన్మకుదుర్గమ్మజపముజేయ
సార్థకత,ముక్తిఫలమునుసముచితముగ
నిచ్చిమెండుగాయిచ్ఛలనిట్టెదీర్చు!!!

కామెంట్‌లు