ప్రక్రియ : సున్నితం
===============
స్వతంత్ర్య భారతమా ఇది
తలుచుకుంటే కదులును మది
ఉప్పొంగిన ఆవేదనతో హృదినది
చూడచక్కని తెలుగు సున్నితంబు..!
పరుల పాలన అంతం
ఇప్పటి రాజకీయాల పంతం
నష్టాలవుతున్నాయి మన సొంతం
చూడచక్కని తెలుగు సున్నితంబు..!
మన భారతీయులు అమాయకులు
కమ్మేసాయి స్వతంత్ర్య భ్రమలు
ఆలోచించి తెరవాలి కనులు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
స్త్రీకి స్వేచ్చ లేదు
గ్రామస్వరాజ్యం ఇంకా రాలేదు
భారతం స్వతంత్య్రం కాలేదు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
అవినీతి అంతం అవ్వాలి
అభివృద్ధి సమృద్ధిగా జరగాలి
స్వతంత్ర్య భారతం విరజిల్లాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి