బాల పంచపది
=============
1 ఉడుత చేసిన,
సరి సహాయము!
వారధి నిర్మాణాన,
అణుమాత్రము!
రామ విజయాన,
చిరుమూలము!
పొందినది ,
రామ ఘన సంతకము!
చేసిన సాయం ,
దాచిన పుణ్యం, రామా!
2. పరమాత్ముని,
మాటసాయము!
పాండవులకు,
యుద్ధాన వరము!
పలు సందర్భాలలో,
పరిష్కారము!
అంతిమంగా ,
విజయ సాక్షాత్కారము!
చేసిన సాయం ,
దాచిన పుణ్యం, రామా!
3. చీమ మునిగిపోతుండ నీట!
చెట్టు పై పక్షి ఆకు వేసేనట!
ఆకుపట్టి చీమ ఒడ్డు చేరెనట!
పక్షిసాయం చీమ మరవలేదట!
చేసిన సాయం,
దాచిన పుణ్యం , రామా!
4. ఆకలి గొన్నవాడికి అన్నము!
వస్త్రరహితుడుకి వస్త్రము!
ఆశ్రయహీనుడికి ఆశ్రయము!
మనిషి చేసే ఓ సహాయము!
చేసిన సాయం ,
దాచిన పుణ్యం, రామా!
6. సాయానికి ,
అక్కర్లేదు పెద్దమూట!
ఆపదల్లో,
ధైర్యం చెప్పే మాట!
కష్టాల్లో ,
ఓదార్పు ఇచ్చే మాట!
భయంలో,
ఊరట నిచ్చే మాట!
చేసిన సాయం,
దాచిన పుణ్యం ,రామా!
6. సొంతలాభం ,
కొంత మానాలి!
పొరుగువాడికి,
తోడుపడాలి!
మనిషి ,
సాయం చేస్తూ బతకాలి!
సహాయం,
మానవ ధర్మం కావాలి!
చేసిన సాయం ,
దాచిన పుణ్యం, రామా!
_________
తోడుపడవోయ్!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి