బాల పంచపది
=============
1. అందంగా ఉండే ఆకారము!
ఆకర్షణీయమైన రూపము!
అదేమిటో సృష్టి విచిత్రము!
అంతరంగం మరి వెలపరము!
అందంగా ఉండాలి,
గుణాల మించాలి ,రామా!
2.రూపం నల్లటి నలుపు!
కంఠం తీయని పిలుపు!
బతుకు రాగంతో కలుపు!
మనకు గీతాలతో మైమరపు!
అందంగా ఉండాలి,
గుణాల మించాలి,రామా!
3.మామిడిపండు ,
ఎంతో ప్రియము!
రూపం సువర్ణం,
రుచి మధురము!
చీకిపారేసిన,
టెంకా ధన్యము!
మామిడిచెట్టు,
తిరిగి ప్రత్యక్షము!
అందంగా ఉండాలి,
గుణాల మించాలి, రామా!
4.మనుషులు,
మేక వన్నె పులులు!
విషం కలిసిన ,
పాల కుండలు!
పచ్చల పిడులున్న,
బలే బాకులు !
తేనెల మాటలు,
తీసేవి గోతులు!
అందంగా ఉండాలి,
గుణాల మించాలి, రామా!
5.మనిషి ,
బహిరంగం స్వచ్ఛము!
అంతరంగం,
మరి పవిత్రము!
బాహ్యాంతరాల,
సమశుచిత్వము!
ఆ సాధనే ,
జీవన సాఫల్యము!
అందంగా ఉండాలి,
గుణాల మించాలి, రామా!
_____''___
: బాహ్యాంతరశుచి!;-డా. పి. వి ఎల్ .సుబ్బారావు.- 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి