పండు పండు నిమ్మపండు
పసుపు రంగు నిమ్మపండు
విటమిన్ 'సి'ఎక్కువుండే
మేలిమైన మంచిపండు
ఎల్లప్పుడు దొరుకుతుంది
రోగాలను బాపుతుంది
చలువచేసి మరీమరీ
ఆరోగ్యం కూర్చుతుంది
సత్తువనే ఇస్తుంది
రక్తపటిమ పెంచుతుంది
మన ఆయుష్షు పెంచుతూ
మనకు మేలు చేస్తుంది
నిమ్మరసం తేనె కలిపి
ప్రతి దినము సేవించిన
కొత్త శక్తి మనకొచ్చును
ఆరోగ్యం సొంతమగును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి