కలలు నిద్రించవు మెలకువలో
కలతలు మేల్కొన్నాయి మగతలో
రాత్రి పగలుగా మాయలో
వెలుగు చీకటిగా భ్రమలో కాలం
కనుల రాలే వర్ష బిందువులు
ఉప్పగా చప్పగా తుఫాను నీరులా
తీయని బాధ పాకే మనిషిలో
కష్టాల సెలయేటి బతుకు అంచుల
బతుకు తీపి ఎవ్వరు కాదనేదీ!
పుట్టుక చావుల నడుమ కాలం
భయం భయంగా బాధగా
చావు క్షణమైనా
ఎప్పుడో ఎలానో అన్నోన్ టు ఆల్..
మృగతృష్ణలో దాహం తీర్చని జలం
మరీచిక భ్రాంతి శూన్యమైన నిజం
ఎండమావుల పరుగు క్షామభూమి
వలయంలో ఆశల జీవితం
ఎప్పుడూ ఆశను గెలిచే నిరాశ
గాయం పిలిచే మనసులో
బాధ గోరెచ్చని ఉప్పనీటి కన్నీరే
కుబుసం వీడిన తుఫాను హోరులో
మనిషి అంతరంగం ఉద్వేగ తరంగం
ఓ మౌన గీతంలో శబ్దించే సముద్రం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి