ఆనంద హృదయాలు ;-ప్రభాకర్ రావు గుండవరం (మిత్రాజీ );-ఫోన్ నం.9949267638
(ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా )

🌹🌹🌹

నీ హృదయం
నా హృదయం
జత కలిసి సాగింది
ఆనంద తీరాలు చేరింది

పచ్చని మన సంసారం
పాల వెల్లువై పొంగింది
చక్కని మన జీవన నావ 
సుఖ ప్రయాణం చేసింది

ఒడి దొడుకులు లేనే లేవు
అరమరికలు అసలే లేవు
ఆదర్శమైన  మన దాంపత్యం
అనురాగంతో పయనించింది

చక్కని మన జీవితం
సంగీతస్వర జలపాతం
సంతోష సంబర మణిహారం
సుమధుర సౌందర్య రస కావ్యం 

మమతల మనసులతో
ప్రేమలు పొంగిన హృదయంతో
కలకాలం ఇలాగే సాగాలి
నవ వసంతంతో నిండాలి

నువ్వూ నేనూ
మన ఇద్దరమూ
మన కిద్దరుగా
ఈ సృష్టికి నాంది పలకాలి
🌹🌹🌹

కామెంట్‌లు