మనం ఏపని చేసినా ముందు చూపుండాలి.భవిష్యత్తుని గురించి ఆలోచించాలి. పెద్దలు ఇచ్చినదంతా జల్సా చేస్తూ ఖర్చు పెట్టేస్తే భవిష్యత్తులో రోగమో రొచ్చు ఆపద నెత్తిన పడవచ్చు. ఎవర్నీ డబ్బు అడగలేము. అందరివీ రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు! ఆలోచనలో మునిగిన తాత చుట్టూ చేరారుపిల్లలు!"తాతా! మేము ఇంజనీర్ సాఫ్ట్వేర్ డాక్టర్ యాక్టర్ రాజకీయ నేత అవుతాం "అని అరుస్తుంటే తాత బాధగా అన్నాడు " తెల్లారింది మొదలు తిండి బట్ట అవసరం! ఒక్కరు కూడా స్వదేశీ పాడిపశువుల్ని పెంచాలని కల్తీ ఎరువులు వాడరాదు అని కూరలు పంటలపండించే చదువు అధ్యాపకుడుగా మారుతామని చెప్పలేదు. మీలో ఉన్న శక్తి యుక్తులను బైటకి తీసే టీచర్ కావాలనే కోరిక ఏఒక్కరిలో లేకపోటం శోచనీయం! వేళ్ళు కాండం లేకుండా పండ్లకోసం ఆరాట పడుతున్నారు. " "తాతా!ఉద్యోగం తో హాయిగా నెలజీతం వస్తుంది. పొలంపనులు కష్టం కదా?" తాత అన్నాడు " మనం స్వార్థంతో పంటపొలాల్ని నాశనం చేసి అపార్ట్మెంట్స్ కడ్తున్నాం.పర్యావరణ నాశనం చేస్తున్నాము.ప్రతివారూ ఐ.టి.రంగంలో దూకారు. లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసి ఇప్పుడు వెలాతెలా పోయాయి.ఇంత చదివి చిన్న జాబ్స్ చేయటం నామోషీ! మంచి విద్యను అందించే బడిస్థాయిలోనే అధ్యాపకులు తయారు కావాలి.ఓకథ చెప్తా వినండి. ఓమడుగులో కప్పలున్నాయి.మడుగు ఎండిపోసాగింది.పైగా కప్పకాళ్లు నరికి విదేశాలకు ఎగుమతి చేసే దుర్మార్గులు తయారైనారు.అందుకే బాగా నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతం కి వెతుక్కుంటూ బైలు దేరాయి.ఓచోట పెద్ద బావి కనిపించింది. చిన్న కప్పలు "మేమింక గెంతలేము.ఈబావిలో దూకుదాం"అన్నాయి.అనుభవం ఉన్న పెద్ద కప్పలు అన్నాయి"బావిలో నీరు ఎండిపోతే మనం పైకి దూకి బైట పడటంకష్టం! మనం చెరువులు కాలువల్లోనే బ్రతుకు దాం". కప్పలు అన్నీ సై అని కష్టం ఐనా ఓ నీటితో కళకళలాడే జలాశయం లో దూకి సుఖంగా ఉన్నాయి. పిల్లలూ! నానలుగురు కొడుకులు తలా ఒక వృత్తిలో స్థిరపడినారు.కానీ నేడు వారు పిల్లల కోసం తమకున్న దంతా అమ్మి అప్పులు చేసి చైనా యుక్రైన్ రష్యా మొదలైన దేశాలకి పంపుతూ లక్షలు ఖర్చు పెడుతున్నారు. రేపు ఆపిల్లల పెద్దల భవిష్యత్తు ఏంటి?మన దేశంలోనే చదివి కంపెనీ పంపితే విదేశాలకి ఉద్యోగరీత్యా వెళ్లటం మంచిది. కానీ ఉన్నదంతా పిల్లల విదేశీ చదువులకీ ఖర్చు చేస్తే వారి గతి ఏంటి?"తాత ప్రశ్నలకు పెద్ద పిల్లలు ఆలోచనలో పడ్డారు.🌹
ముందు చూపు!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి