ద్వితీయ వార్షికోత్సవం ; -యామిని కోళ్లూరు
సాహితి బృందావన జాతీయ వేదిక 
ప్రక్రియ :   సున్నితంబు 
రూపకర్త : శ్రీ మతి నెల్లుట్ల సునీత గారు 
========================

306.సాహితిపూదోటలో మరో కుసుమము 
   పరిమళాలు వెదజల్లే  సౌరభము 
     కొంగొత్త సున్నితంబు సమూహము  
     చూడచక్కని తెలుగు సున్నితంబు 

307.  కవులు కవయిత్రుల చేరికలు 
     ప్రేమతో పలకరించే పలకరింపులు 
   కలంనుంచి జాలువారే ముత్యాక్షరాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు 

308.విశ్లేషకుల సున్నితపు సమీక్షలు
     ప్రతిభకు పట్టంకట్టే పురస్కారాలు 
    మనసుని కట్టిపడేసే సుమధురఙ్ఞాపికలు 
    చూడచక్కని తెలుగు సున్నితంబు 

309. శతాధిక అంశాల సమూహం 
     ద్విశత వార్షికోత్సవ సంబరము 
సమూహంలో మిన్నంటే కోలాహలము 
   చూడచక్కని తెలుగు సున్నితంబు 

310. అందరిని ఆదరించే లావణ్యము
    ప్రపంచశిఖరాగ్ర  సదస్సులో ఒదిగిఎదిగిన
    సున్నితంబు  రూపకర్త  సున్నితసునీత 
       చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు