గద్వాల సోమన్నకు ఘన సన్మానం




 పెద్దకడబూరు మండల పరిధిలోని  హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు నాగులదిన్నె ఉన్నత పాఠశాలలో ఘనం సన్మానం జరిగింది.  గద్వాల సోమన్న విరచిత పుస్తకం "రత్నాల సరాలు" మరియు నాగులదిన్నె విద్యార్థులు వ్రాసిన  "ఏటిగడ్డ కథలు" పుస్తకావిష్కరణల సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శివరాం,విచ్చేసిన సాహిత్యవేత్తలు పార్వతి, పుల్లా రామాంజనేయులు,నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు కవి,సమీక్షకులు సోమన్నను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు