చాంధస బావాలు
రాజ్యమేలు తున్నపుడు
అజ్ఞాన అంధకారాలు
తొలగించగా పుట్టెనపుడు
రాజా రామ్మోహనురాయ్
సమాజంలో రుగ్మతలబాపేనోయ్
మంచి చెడులను
నిశితముగా చూపెనోయ్ !
మహిళా చైతన్యము
అవసరమని బోధించెను
విద్యఎంతో ముఖ్యము
కులవివక్ష తప్పనెను !
సమానహక్కులు ఉండాలి
మూఢనమ్మకం వొదిలేసి
ఐక్యతతోను మెలగాలి
సంస్కారంతో కృషిచేసే !
మతపర మూఢనమ్మకము
సమాజంలో తొలగించి
మహిళా అభ్యుదయము
బ్రహ్మసమాజం స్థాపించినాడు
వితంతు వివాహములు
సమర్దించి ధైర్యంగా
బాల్య వివాహములు
ఖండించి విశేషముగా !
సతీ సహగమనము
మహాపాపమని తెలిపాడు
స్త్రీల జీవితగమనము
వెలుగేనింపిన ధీరుడు !
ఆధునిక భారత
పితా మహునిగా
వెలిగింది ఒకజోత
రాజారామ్ మోహనుగా !
రాజా రాంమోహన్ రాయ్! ;-ఎం. వి. ఉమాదేవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి