కె.వి.ఆర్ హై స్కూల్ లైబ్రేరియన్ బోయ శేఖర్ కు మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారము

 కర్నూలు స్థానిక కె.వి.ఆర్ గార్డెన్, కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లైబ్రేరియన్ బోయ శేఖర్ మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారము అందుకున్నారు.
గాంధీ కింగ్ ఫౌండేషన్,హైద్రాబాద్ సంస్థ వారు,
గాంధీజీ జీవితం - ఆశయాలు అనే అంశంపై నిర్వహించిన అంతర్జాల కవి సమ్మేళనంలో పాల్గొని కవితా పఠనం చేసిన సందర్భంగా కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లైబ్రేరియన్,కవి,రచయిత శ్రీ బోయ శేఖర్ గారికి గాంధీ కింగ్ ఫౌండేషన్,హైద్రాబాద్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్,వ్యవస్థాపకులు డా,క్రాంతి,కార్య నిర్వాహకులు జి.మురళీధర్ రావు గారు పురస్కార గ్రహీత బోయ శేఖర్ ను అభినందిస్తూ ప్రశంసా పత్రంను అంతర్జాల వేదికగా అందచేయడమైనది కె.వి.ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,ఉపాద్యాయులు అంతర్జాల వేదికగా లైబ్రేరియన్ బోయ శేఖర్ కు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు