దశాబ్దాలుగా
కనీస మద్దతు ధరల పేరిట
శ్రమదోపిడికి గురి అవుతున్నా...
కరోనా కుంపట్లు రగిలించిన
దుర్భర పరిస్థితుల్లో సైతం
కాడీమేడీ వదలకుండా
జాతికి వెన్నుదన్నుగా
నిలుస్తున్న అన్నదాతను నేను.....!!
ఆకలి మేఘం కమ్మినా....
బిడ్డల ఆదరణ కరువైనా....
అలవాటైన దేహాన్ని
నీడ పట్టున ఉంచటం ఇష్టంలేక...
ఆలి కంటిలోని
ఆత్మ విశ్వాసమే ఆలంబనగా....
బ్రతుకు పోరాటం చేస్తున్న
బడుగు జీవిని నేను....!!
సమస్యల
సుడిగుండంలో చిక్కిన నన్ను
స్వేచ్ఛా విపణి
నిస్సహాయ జీవిగా మార్చినా..
సార్వభౌమత్వంతో
దేశం రాజీపడకుండా
నమ్ముకున్న నేలను కాచే
సైనికుడిని నేను....!!
సకాలంలో వర్షాలు కురిసి
పాడిపంటలతో పుడమి విలసిల్లి
నిర్భయంగా ప్రాణకోటి
స్వేచ్ఛగా జీవించాలని
కోరుకుంటున్న ....
"ఆశాజీవిని నేను"...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి