విశ్వ నరుడు ;-ఎం. వి. ఉమాదేవి బాసర
(ఆట వెలదులు )

గబ్బిలమును బంపె గంగాధరుకడకు 
వేయి ప్రశ్నలడుగ విమలమతిని 
విశ్వనరుడుగాను విఖ్యాతి రచనలు 
జాషువాకు గొప్ప జయమునిచ్చె !!

ఫికరులేక వ్రాసె ఫిరదౌసి కావ్యమ్ము 
నిగ్గదీసి యడిగె నిజములెన్నొ 
అంటరానితనము నదియెట్లు పాపమ్ము 
చెప్పుమనెను చెంప ఛెళ్ళుమనగ!!


కామెంట్‌లు