సుప్రభాత కవిత ;-బృంద
పాతుకున్న బంధాలు
ఏనాటికీ మాసిపోవు

క్షణములన్ని గతములైన
తలపులన్ని  తాజాగనే

కనుతడవని గమనంలేదు
కలలు కనని నయనం లేదు

తిమిరంలో అడ్డంకులు
వెలుగుల్లో  మాయమౌను

మాయలెన్నో కమ్మబోయినా
కరిగిపోని నిర్ణయాలు
అలల తాకిడికి శిలలు
కరిగేనా?

నిర్ణయం స్థిరమైతే
గమ్యం నిర్దిష్టమౌను

దారి మారవచ్చు కాని
దారి తప్పరాదు

వెలుగు వచ్చువరకు మాత్రమే
చీకటి రాజ్యం

మేలిపొద్దుకై వేచిన మది పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸

బృంద 🙏
https://www.molakanews.page/2022/09/blog-post_434.html?m=1
ధన్యవాదాలు  సర్💐🙏
రంగులీను ఈ జగమే
సుందర నందనవనము

ప్రతి ఉదయం 
ఒక అద్భుతం

మనచుట్టూ ఉన్నరంగులే
మన జీవితంలోనూ....

ఆశకు వెలుగు
నిరాశకు చీకటి

కోరిక కు ఎరుపు
తృప్తికి తెలుపు

ప్రతిభావానికీ
ఒకరంగు ప్రతీక

చెలిమిదో రంగు
ప్రేమదో రంగు

లోపల ఓ రంగు
బయటికో రంగు

వేకువలో రంగుల
రంగవల్లులేసే గగనం

రంగురంగుల పువ్వులతో 
ఆకులతో
నవ్వే భువనం

ప్రకృతిని చూస్తూపరవశించే  అంతరంగముంటే

రకరకాల రంగుల పువ్వులు
విరబూసిన అనుభూతుల
ఉద్యానవనం మన జీవితం.

హృదయంతో 
ఉదయరాగమాలపించి
స్వాగతిద్దాం మరో రోజును

🌸🌸 సుప్రభాతం 🌸🌸

బృంద 🙏
రంగులీను ఈ జగమే
సుందర నందనవనము

ప్రతి ఉదయం 
ఒక అద్భుతం

మనచుట్టూ ఉన్నరంగులే
మన జీవితంలోనూ....

ఆశకు వెలుగు
నిరాశకు చీకటి

కోరిక కు ఎరుపు
తృప్తికి తెలుపు

ప్రతిభావానికీ
ఒకరంగు ప్రతీక

చెలిమిదో రంగు
ప్రేమదో రంగు

లోపల ఓ రంగు
బయటికో రంగు

వేకువలో రంగుల
రంగవల్లులేసే గగనం

రంగురంగుల పువ్వులతో 
ఆకులతో
నవ్వే భువనం

ప్రకృతిని చూస్తూపరవశించే  అంతరంగముంటే

రకరకాల రంగుల పువ్వులు
విరబూసిన అనుభూతుల
ఉద్యానవనం మన జీవితం.

హృదయంతో 
ఉదయరాగమాలపించి
స్వాగతిద్దాం మరో రోజును

🌸🌸 సుప్రభాతం 🌸🌸

బృంద 🙏
https://www.molakanews.page/2022/09/blog-post_358.html?m=1
ధన్యవాదాలు  సర్💐🙏
దివినుండి భువికి దూకే
ప్రవాహపు ఉత్సాహం 

శిఖరాల మధ్యన
దూకు  జలపాతము

ఎంత ఎత్తునుండి
జారినా
నేలమీదే దాని గమనం

ఎంత ఎత్తుకి మనం ఎదిగినా
మనకు ఆధారం నేలమీదే

రకరకాల విన్యాసాలు
జలపాతానిది

రకరకాల జీవనమార్గాలు
మనిషివి

ఎగుడు దిగుళ్ళ 
లెక్కచేయక సాగే
తెంపరితనం వాగుది

ఎత్తు పల్లాల గమనంలో
ఓర్పు సహనం తప్పనిసరి
మనిషికి.

గమ్యం వేపే పయనం
కాలంతో ఎదురీదే
సంయమనం.

సాగే సెలయేటి  గమనం
సాగర సంగమం

తృప్తే.. తరగని అస్తిగ
సాగే జీవిత పయనం

ఆనంద మకరందం
అయాచితంగా అందించే
అందాల ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు