సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 బోధ... ప్రభోద
*****
 బోధ , ప్రబోధ..పదాల రెండింటిలో బోధనే ఉంది.కానీ బోధన,ప్రబోధన ఈ రెంటినీ లోలోతుగా తరచి చూస్తే భేదం చాలా కనిపిస్తుంది.
 బోధ లేదా బోధన అంటే చెప్పేవారు చెబుతారు వినేవారు వింటారు. అది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ.
 కేవలం వినటం వరకే పరిమితమైతే.ఆ బోధన వల్ల మార్పు రావచ్చూ, రాకపోవచ్చు.
 
 కానీ ప్రబోధ అలా కాదు.బోధించే గురువు తన స్వానుభవాలను,సమాజ పోకడలను పాఠ్యాంశాల్లో రంగరించి తనదైన శైలిలో, బోధనా వ్యూహంతో విద్యార్థుల్లో మార్పు కోసం చెప్పేది.
అనగా గురువు ప్రబోధలో అనుభవాల సారం విద్యార్థికి అనుభవైక వేద్యంగా మారుతుంది. విద్యార్థుల్లో అవగాహన పరిధి పెరిగి శ్రద్ధాసక్తులను పెంపొందిస్తుంది.
అలా శ్రద్ధ,ఆసక్తి విద్యార్థి పెంచుకోగలిగిన నాడు గురువు గారి ప్రతి బోధనా,ప్రబోధగా శిష్యుల హృదయాల్లోకి వ్యాపించి, వారిని జ్ఞానవంతులుగా  మారుస్తుంది.
 
ఈ బోధ,  ప్రబోధగా ఎంత వరకు ఫలవంతం అవుతుంది అనేది చెప్పేవారిపైనా, వినేవారి పైన ఆధారపడి ఉంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏



కామెంట్‌లు