*: దశావతార వర్ణనము - వామనావతారము :*
*చంపకమాల:*
*పదయుగళంబు భూగగన | భాగములన్ వెసనూని విక్రమా*
*స్పదముగా నబ్బలీంద్రు నొక | పాదమునన్ తల క్రింద నొత్తిఁమే*
*లొదవ జగత్ప్రయంబుఁబురు | హూతుని కీయ వటుఁడవైన చి*
*త్సదములమూర్తి వీవె కద | దాశరధీ ! కరుణాపయోనిధీ !*
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా!
నీ ఒక కాలితో భూమి మొత్తం, మరొక కాలితో ఆకాశమండలం అంతా ఆక్రమించి, మూడవ పాదముతో మహా బలవంతుడు అయిన బలిచక్రవర్తిని పాతాళములోకి అణగ తొక్కి, మూడు లోకాలకు ఇంద్రుని అధిపతిగా చేయడానికి చిన్న వాడైన వటుడిగా అవతారము దాల్చింది నీవే కదా గరుడగమనా!......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*వామనుడు పొట్టివాడైన గట్టి వాడే. ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తి వామనుని ముందు నిలువ లేకపోయాడు కదా! మన వాడు, పొట్టివాడు అయిన గాంధీ తాత బ్రిటిష్ వారిని తరిమి కొట్టాడు, లాల్ బహదూర్ శాస్త్రి చైనాను ఎలా గడగడ లాడించాడో మన చిన్నతనం నుండి చరిత్రలో చదువుకున్నాము. ఇక ఒకప్పటి క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, ఇప్పటి దిగ్గజం సచిన్ టెండూల్కర్ పొట్టి వారే. కానీ భారతీయ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చి వేసి చరిత్రలో తమకోక పేజీ రాసుకున్నారు. కనుక మన మధ్య పొట్టి వారు వుంటే చులకనగా చూడకుండా, వారంతా వామనుని ప్రతి రూపాలుగా అనుకుని, ఆ కమలనాభుని తలచుకుంటే పుణ్యం, పురుషార్ధం కూడా దక్కుతుంది. ఇటువంటి అందమైన ఊహ మనకు కలిగి, మనం ఆ పద్మపాదునితో ఉండే ఆలోచనలను ఆ ఉమాపతి కలిగించాలని, నిశాచరపతిని ప్రార్థిస్తూ!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి