రేడియో మాణిక్యం (3);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఒక్క అనౌన్సర్గా  ఉండడం తనకు ఇష్టం లేదు లలిత గీతాల కార్యక్రమంలో పాల్గొనడం  ఎన్నో నాటకాలలో  పాత్రలు నిర్వహించడమే కాక  దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించింది. అమ్మ చేసిన ఏ నాటకం బాగుండదు అన్న పేరు తెచ్చుకోలేదు. ఈ కార్యక్రమాలు చేస్తూనే  ప్రత్యేకంగా ఆమెకు విపరీతమైన పేరు వచ్చింది  కార్మికుల కార్యక్రమంలో ఆ పాత్ర  ప్రక్కన సత్యనారాయణను  సోదరునిగా ఎంచి ఇద్దరు సంభాషణ రూపంలో చేసిన కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్న పేరు సార్థకమైంది  నిజానికి ఆమె ఎన్ని కార్యక్రమాలు చేసినా చిన్నక్క అంటే చిన్న కుర్రాడి దగ్గర నుంచి ముసలివారి వరకు  మా రత్న అక్క  అని అంటారు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న  వారు స్త్రీలలో మరి ఎవరూ లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. దానికి తగిన విధంగా ఆమె సహకారం ఎవరూ మర్చిపోలేరు
మేము  కొన్ని సందర్భాలలో వేదికపైన  ప్రేక్షకుల మధ్య కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటాం. ఒకసారి నాటకం  మరొకసారి సంగీత రూపకం  ఇంకొకసారి  సంగీత సభ  కొన్నిసార్లు కదంబ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. సంగీతంలో పేరు ప్రఖ్యాతులు పొందిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బాలమురళి లాంటి వారిని అందరిని పిలిచి  వారిని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అమ్మ వేదిక పైన  కార్యక్రమాన్ని విజృంభిస్తూ చేస్తోంది. తన దీక్ష, దక్షత ఏమిటో  ప్రేక్షకులకు తెలిసేలాహుందాగా అలతి అలతి పదాలతో వినేవారి మనసుకు హత్తుకునేలా  భావస్ఫోరకంగా వినిపించడం  ఆవిడ ప్రత్యేకత. అలాంటి వారు మా రేడియోకి అలంకారాలు ఆమెకు తెలియని అజ్ఞాత  అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారు. తాను ఇంటి దగ్గర నుంచి ఆకాశవాణి కేంద్రానికి వస్తున్న సమయంలో  తనకు ఎదురైన సంఘటనలను  చిన్న కథ గా మార్చి ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమానికి అనుగుణంగా  సమన్వయపరిచి చెప్పడంలో ఆమె దిట్ట  సామాన్యంగా ఆకాశవాణిలో ప్రతి అక్షరం వ్రాసుకునే చదువుతాం  కానీ అమ్మ ఆశువుగా అప్పటికప్పుడు శ్రోతలు కూడా ఆ దృశ్యాన్ని  అర్థం చేసుకునేలా చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒక్కొక్క సందర్భంలో ప్రక్కనున్న సత్యనారాయణ  కంగుతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.  అక్కా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో పెడుతున్నావు అని అనేకసార్లు  చెప్పడం నాకు తెలుసు. సర్లే తమ్ముడు ఇంకెప్పుడు అలా చేయనులే అంటూనే ఉంటుంది మళ్ళీ మామూలే  ఒక వ్యక్తికి  ఒక అలవాటు ఉంటుంది  దానిని మార్చుకోవడం వారి చేతిలో ఉండదు అమ్మ కూడా అంతే.

కామెంట్‌లు