"నవదుర్గామాతస్తుతి"!!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
"కాళరాత్రి"దుర్గమ్మగాకానిపించి
సర్వశుభదాయిగానుతాసర్వజనుల
కిహపరఫలసాధకములనిచ్చుచుండి
గ్రహపుబాధలతొలగించునహరహమ్ము!!!

02.
తే.గీ.
దుష్టసంహారమునుజేసితుష్టినిడును
త్రినయనియపర్ణలలితాంబమనములోన
నిలుపుకున్ననుజన్మకునిరుపమాన   
కీర్తిలభియించుసతతంబునార్తిబాపు!!!

03.
తే.గీ.
నీదుదర్శనభాగ్యమేనిండుధనము 
నిన్నుజూచినపాపాలునన్నిబోవు
నిన్నుభజియించువారికినిత్యశుభము
నీవెయఖిలజగమ్ముకునీవెరక్ష!!!

కామెంట్‌లు