దత్తత;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒకరు కనిపెంచిన పిల్లలను మరొకరు స్వీకరించి పెంచడాన్ని దత్తత తీసుకోవడం అంటారు. అమ్మానాన్నల ఆలనాపాలన తో పెరిగి  కొంచెం ఊహ వచ్చిన తరువాత  మరొకరిని తల్లిదండ్రులు గా భావించి  వారితో శాశ్వతంగా ఉండాలి అంటే  ఎంతో కష్టంతో కూడుకున్న పని  ఈ రక్తసంబంధం మనసులతో  ఏర్పడినది. అందుకే దానిని బంధము అన్నారు. స్వభావ సిద్ధంగా ఉన్న బంధానికి  కృత్రిమంగా సాధన వల్ల వచ్చిన బంధానికి ఎంత భేదం ఉంటుంది. ముందు ఆ బిడ్డ  వారిని మానసికంగా అమ్మానాన్నగా అనుకోవాలి  అమ్మగా ఆమె ఎంతో ముద్దుగా కన్నతల్లిలా దగ్గరకు తీయాలి  అలాంటి సందర్భంలో  రోజు రోజు ఆ పెరుగుతున్న బంధం  దృఢంగా పెన వేసుకుంటుంది  ఆ స్థితికి వచ్చిన వాళ్ళు  నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. బిడ్డలు లేని తల్లి  అమ్మా అని పిలిపించుకోవాలన్న  కోరికతో  తెలిసిన బంధువులను గానీ స్నేహితులను కానీ సంప్రదించి  దత్తు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా  తండ్రి కూతురు వయసులో ఉన్నవారు స్నేహితుడు అయితే  వారి మధ్య అనురాగం పెరిగి తాను సొంతగా చూసుకుంటూ ఆమె తండ్రిగా గౌరవిస్తూ ఉన్న  సందర్భంలో ఓ రోజు నాన్నా నిన్ను నేను దత్తు తీసుకుంటాను అంటే ఆ పిల్ల ఎగిరి గంతేసి సరే అంటుంది. ఇంటికి వెళ్లి కన్నతల్లితో చెబితే  ఆమె అంగీకరిస్తుందా?  ఆ మాట వినగానే  తల్లి మనస్సు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 9 నెలలు కనిపెంచి  పాపని ఇంత దానిని చేస్తే  నన్ను వదిలి వెళ్లాలని తాను అనుకుంటుందా?  లేక మమ్మల్ని విడదీయడానికి ఆ పెద్దమనిషి ప్రయత్నం చేస్తున్నాడా?  అన్న ఆలోచన వచ్చి అలాగే నమ్మ వెళ్ళు వెళ్లి మళ్లీ ఇక్కడికి తిరిగి రాకు అక్కడే ఉండు అని ముసి ముసి నవ్వులతో  మాట్లాడుతుంది తప్ప  నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలు మాత్రం కాదని ఆ చంటి పిల్లకు కూడా తెలుస్తోంది. అంటే నా అల్లరి భరించలేక వెళ్లి పొమ్మంటున్నావా  నేను వెళ్లి పోతే నీకు ఎలా ఉంటుంది  బాధగా ఉండదా  అని అడిగిన బిడ్డకు ఏంటి సమాధానం చెబుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని  ఆనాటి భోజనానికి  డబ్బు సంపాదించుకునే కూలీలు కూడా  తమ రక్తమాంసాలు పంచుకుని పుట్టిన బిడ్డను ఇవ్వడానికి అంగీకరించరు కదా.  కారణం ఆ తీసుకున్న తల్లి తనలాగా ఆప్యాయంగా చూడగలదా లేదా అన్న అనుమానం వస్తుంది ముందు, చెట్టుకు కాయ భారమా అన్నట్టుగా  నాకు బిడ్డ దూరం అయితే ఆమె భరించగలదా  పగలంతా కష్టపడి ఇంటికి వచ్చిన తరువాత  ఆ బిడ్డ అల్లరితో  ముచ్చట్లతో  సేద తీర్చుకుంటున్న మాకు ఆ బిడ్డ లేని లోటును భరించగలమా అని ఆలోచిస్తుంది  అదే తండ్రి ఏమంటాడు  అలాగే నమ్మ వెళ్ళు  నాకు  అభ్యంతరం లేదు. కానీ నీకు అక్క గానీ, చెల్లి కానీ లేదు కదరా. ఒంటిగా  ఉన్న నీవు లేకపోతే  అమ్మ బ్రతుకుతుందా అని అంటారు తప్ప తన బాధను వ్యక్తపరచరు. అదీ తండ్రి తత్త్వం  మరి అలాంటి ఆప్యాయతలకు నెలవైన  తల్లిదండ్రులను వదిలి ఏ బిడ్డ  అయినా వెళ్లడానికి సిద్ధ పడుతుందా? మీరూ ఆలోచించండి.



కామెంట్‌లు