బిడ్డల ఆరోగ్యం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఖరీదైన హోటళ్లలో  రకరకాల రుచులను  ఆస్వాదించాలన్న యువత మొదటి నుంచి అలాగే చేస్తున్నదా?  మధ్యలో అభిరుచి అలవాటయిందా. ఒకసారి ఆలోచిస్తే బిడ్డకు  చక్కగా నేతితో పిసికి కలిపి గోరుముద్ద తినిపిస్తుంది అమ్మ. ఆ గోరుముద్ద జీవితంలో ఎవరైనా ఎక్కడైనా తయారు చేసి పెట్టగలరా  ఆ రుచిని చూపించగలరా ప్రశ్నార్థకమే. రుచుల జాడ తెలిసిన బిడ్డకు  నచ్చిన విధంగా చేసి ఎలా పెట్టాలో తెలిసినది  అమ్మ తప్ప మరొకరు ఉన్నారా? బయట ఎవరు ఎలా చేస్తున్నారో తెలియకుండా  ఏది కలిపితే రుచి వస్తుందో దానిని కలిసి మన ఆరోగ్యాన్ని నాశనం చేసే రుచికి అలవాటు పడకుండా ఆరోగ్యం కోసం కూడా అమ్మ ఏం చేస్తుందో ఆలోచించక తాను బయట రుచులను రుచి మరిగి  రుచిగా ఉందని కడుపారా తింటే  రేపు ఆసుపత్రిలో పడక మీద హాయిగా పడుకోవచ్చు.
అమ్మ అంత కమ్మటి పదార్ధాలతో తయారు చేసే భోజనం  ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత శుచిగా శుభ్రంగా మడి కట్టుకుని ఎలాంటి క్రిమి కీటకాలకు చోటు ఇవ్వకుండా అమ్మ చేసే వంట  ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? అయితే అమ్మ అంత కమ్మగా చేయడానికి  కారణాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మన పెద్దలు సంప్రదాయ పద్ధతిలో ఏ కూర, ఏ పద్ధతిలో చేయాలి  అమ్మకు చెప్తుంది అమ్మమ్మ దానిని అనుసరిస్తూ ఇవ్వాళ సమాజంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా  కొత్తరకం పద్ధతులలో  బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది  కాక నూనె అంటే బయట పకోడీలు వేసే వారి దగ్గర  నూనె కాగి తగ్గుతూ ఉన్నప్పుడు అది తగ్గిన మరుక్షణంలో మరికొంత నూనె వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో అతనికి తెలిసినా, తెలియకపోయినా  హాని జరుగుతుంది కదా  అలాంటి స్థితి అమ్మ ద్వారా రాదు. అమ్మ కూర చేసేటప్పుడు మూకుట్లో  నూనె వేసి అది కాగిన తరువాత  ముందు కరివేపాకు ఆ వేడి వేడి నూనెలో వేస్తోంది. కరివేపాకు రసం మానవ శరీరంలో ప్రవేశించి జీర్ణక్రియను సక్రమ పద్ధతిలో నడిపిస్తుంది. అలాగే  మెంతులు వేస్తే జీవితంలో  చక్కెర వ్యాధి రాకుండా  బిడ్డలను కాపాడే మందు  క్రమంగా అది నీటిలో నాన వేసి ఉదయం తీసుకుంటే  చాలా మంచిదని వైద్యులు చెబుతూ ఉంటారు. తిరగమోత వేసే పోపు సామాను ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయలు  ఉల్లిపాయలు ప్రతిదీ ఆరోగ్యానికి సరిపోయేవే. బిడ్డ ఆరోగ్యాన్ని సరిచేయడానికి అమ్మ  ప్రథమ వైద్యురాలి అవతారం ఎత్తి  ఎలాంటి  జబ్బులు రాకుండా కాపాడుతుంది తాను పెంచుకున్న చెట్టుకి చీడపీడలు వస్తే ఎంత బాధ పడుతుందో  బిడ్డల విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకుంటుంది.  కనుక బిడ్డలకు నేను ఇచ్చే సలహా అమ్మకు తెలియకుండా ఏ పదార్థాన్నీ మీరు తినకూడదు. మీరు ఏది  తినాలని అనుకుంటున్నారో ఆ విషయం అమ్మకు చెప్తే ఎంతో ఆనందంగా చేసిపెడుతుంది  ఆ అవకాశాన్ని తీసుకొవాలి తప్ప జేబులో డబ్బులు వేసుకుని రోడ్డు మీదకు పరిగెత్తకండి... జాగ్రత్త.



కామెంట్‌లు