అమ్మకు అమ్మే సాటి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నిజంగా అమ్మను వర్ణించడానికి దేవతగా చెబుతారు కానీ, నా దృష్టిలో వారు ఎవరు ఎంత గొప్ప వారైనా అమ్మకు సాటి రారు  బిడ్డకు జన్మనివ్వడం కాకుండా ఆ బిడ్డ ప్రయోజకత్వం సాధించేంతవరకు అనుక్షణం  కంటికి రెప్పలా కాపాడుతుంది కదా. చంటి పిల్లలు పోరాడుతూనే ఉంటారు  వారికి ఏదీ దొరికితే అది తాగుతారు  చెప్పే వయసు కాదు వారిది. ఆ పిల్లలు ఏడ్చేటప్పుడు  ఎందుకు ఏడుస్తున్నారో కూడా కనుక్కోగలిగే స్థితి అమ్మకు ఒక్క దానికి మాత్రమే ఉంది. దోమల లాంటివి, ఈగలు లాంటివి వచ్చి వాలి ఇబ్బంది పెడుతుంటే ఏడుస్తున్నాడా?  నిజంగా ఆకలితోనే ఏడుస్తున్నాడా? అన్నది ఆ ఏడుపు లో స్వరాన్ని బట్టి  అమ్మ స్పష్టంగా చెప్పగలదు   ఆ మూగ ప్రేమకు  మూల్యం ఎంత అని  ఈ ప్రపంచంలో ఎంత గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అయిన  నిర్ణయించగలడా?  అందుకే అమూల్యమైనది అమ్మ. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అని  మన పెద్దలు వేదాంతులు చెప్పేది వింటూ ఉంటే  సమాజంలో ఆమె స్థానం ఏమిటో మనకు అర్థమవుతుంది.
బాబు గానీ పాప గాని పాకుతూ వెళుతూ తన చేతికి ఏది దొరికితే దానిని నోటికి అందిస్తూ వుంటారు. అది మంచి పదార్థమో తెలియదు, చెడ్డ పదార్థమో తెలియదు  ఆ పసి ప్రాణికి దానిని కూడా పసిగట్టి  అలాంటి స్థితి రాకుండా కాపాడేది అమ్మ ఒక్కటే. ఏ సమయానికి ఆ బిడ్డ ఏది అడగదలుచుకున్న  దో దానిని ముందే ఊహించి అందించగలుగుతుంది  పిల్లలు ఏడ్చేటప్పుడు  గమనించండి  రెండు కాళ్లు రెండు చేతులు కొట్టుకుంటూనే  ఆపకుండా అలా ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపు అమ్మ వెంటనే ఆపదు పదం  అదేమిటి బిడ్డ ఏడుస్తూ ఉంటే  ఓదార్చి భుజాన పెట్టుకోవాల్సింది పోయి అలా నవ్వుతూ కూర్చుంటుంది ఏమిటి అని మనం అనుకుంటాం. "బాలానాం రోదనం బలం" అని అమ్మకు మాత్రమే తెలుసు. ఎంత ఎక్కువ సేపు ఆ రాగం తీస్తే ఆ బిడ్డకు అంత ఆరోగ్యం  మనలాగా వ్యాయామాలు చేయలేదు కదా పసిపిల్ల ఆ ఊయ్యాలలో కాళ్లు చేతులు కొట్టుకోవడమే  పెద్ద వ్యాయమం. ఎంత సమయం అన్న విషయం అమ్మకు తెలుసు. ఆ బిడ్డ కొంచెం పెరిగిన తరువాత  ఆహార నియమాలు ఎలా ఉండాలో తల్లికి తెలుసు వైద్యులు చెప్పేది ఏమిటి  పొట్టను నాలుగు భాగాలు చేసి  రెండు భాగాలు ఘనపదార్థం  ఒక భాగం  మంచినీళ్లు  మిగిలిన భాగం  వాయువు అంటే ఖాళీ  అలా ఉన్నప్పుడు  ఆ పిల్లలు తిన్నఆహారం చక్కగా జీర్ణమై  సమయానికి విరోచనమై  ఆరోగ్య ప్రదంగా పెరుగుతుంది. ధనవంతులు ఏ పనిమనిషినో  నర్సునో  ఏర్పాటు చేసుకుంటే  అమ్మ లాగా వారు చేయగలిగిన సమర్థులైనా అందుకే  ఈ ప్రపంచంలో అమ్మను ఎవరితోనూ పోల్చడానికి లేదు  పోల్చబడే వస్తువు ఉన్నప్పుడు కదా పోల్చటం  అది లేనప్పుడు దేనితో పోలుస్తారు. అందుకే జ్ఞాన సంపన్నుడు ఏం చెప్తారు అంటే  అమ్మను పోల్చాలి అంటే అమ్మ గొప్ప మరొకరికి లేదు ఈ ప్రపంచంలో అమ్మకు అమ్మే సాటి  అన్న నానుడి  ఈ ప్రపంచంలో ప్రచారంలో ఉంది  కనుక ప్రతి అమ్మకు పాదాభివందనం.



కామెంట్‌లు